Sunday, April 28, 2024

కూలేందుకు సిద్ధం!

- Advertisement -
- Advertisement -

Water-Tank

పలుచోట్ల పగుళ్లు, బీటలు వారిని వైనం… చాన్నాళ్లుగా నిరూపయోగం…. భయం గుప్పెట్లో పేదలు, ట్యాంక్ సురక్షితం కాదంటూ తేల్చిన ఇంజినీర్లు.. అధికారులు నోటీసులకే పరిమితం…

నాంపల్లి : సుమారు 50 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న మంచినీటి ఓవర్ హెడ్ నాలుగు వైపులా శిథిలావస్థకు చేరింది.. ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్దంగా ఉంది… పలు చోట్ల పగుళ్లు, బీటలు వారి బలహీనమవుతోంది. .దీంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇక ఎపుడైన ఒక్కసారిగా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ట్యాంక్ కిందిభాగాన స్థిరనివాసమేర్పర్చుకున్న పేదల ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని క్షణం.. క్షణం భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. చాన్నాళ్లుగా ఇందులో నీటి నిల్వ లేక వృథాగా ఉంది.

నిర్వహణ, ఆలానా పాలనను అధికారులు పూర్తిగా విస్మరించేశారు. ట్యాంక్ కింద ఉంటున్నవారు ముల్యాన్ని చెల్లించే పరిస్థితి…అధికారుల మాత్రం చోద్యం చూస్తున్నారన్నది స్థానికుల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ఇంతవరకు ట్యాంక్‌కు ఎలాంటి మరమ్మతులు లేవు, కనీసం సున్నాలు వేయని దుస్థితి… కింది నుంచిపై వరకు బీంలు, పిల్లర్లకు పలు చోట్ల పగుళ్లు, బీటలు వారాయి. లోపల ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. అధికారులకు పలుమార్లు చెబుతున్నాం కానీ ఈ దిశగా చర్యలకు ఉపక్రమించడం లేదని బస్తీవాసుల అవేదన….

చాన్నాళ్లుగా నిరూపయోగం….. పలుచోట్ల పగుళ్లు…

స్థానికుల నీటి అవసరాలను తీర్చేందుకు,. నీటిని నిల్వ ఉంచేందుకుగాను జలమండలి అన్ని హంగులతో దాదాపు 30 మీ టర్ల పొడవున ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నిర్మించింది. ఈ ట్యాంక్ ద్వారానే స్థానికులకు నీరందేవి. అనంతరం ఇళ్లలో న ల్లాల కనెక్షన్లు తీసుకోవడం, నీటి పంపిణీ వ్యవస్థ మెరుగుకావడంతో ట్యాంక్ సేవలను జలమండలి వర్గాలు విస్మరించారు. 15 ఏళ్ల క్రిందటే కింది నుంచి పైప్‌లైన్ ద్వారా ట్యాంక్ పైకికి నీళ్లను పంపించే ప్రక్రియ నిలిచిపోయింది. అ ప్పటినుంచి ట్యాంక్ వృధాగా ఉంది.. ట్యాంక్ నిర్వహణ తమ వల్ల కాదంటూ అధికారులు చేతులెత్తేశారు.

ట్యాంక్ కింద పలు నివాసాలు, మలిగెలు వెలిశాయి. పగుళ్లు, బీటలు వారాయి. పగుళ్ల ధాటికి లోపల ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. సున్నాలు లేక ట్యాంక్ కట్టడం నాలుగు వైపులా శిథిలావస్థకు చేరింది. బలహీనమవుతూ… పడిపోయేందుకు రేడీగా ఉంది.. ట్యాంక్ కట్టడం ఏ మాత్రం సురక్షితం కాదంటూ ఇంజినీర్లు తేల్చారు. అ యినా.. జలమండలి వర్గాలు మాత్రం ప్రజల ప్రాణాల భద్రతకు ఏ మాత్రం విలువ ఇ వ్వడం లేదన్నది బస్తీవాసులు మండిపడుతున్నారు. ఎపుడు కూలుస్తారా అని వారు ఎదురుచూస్తున్నారు.

నోటీసులు ఇచ్చారు. కూల్చడం మరిచారు….

ట్యాంక్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.. కింది పలువురు పేదలుంటున్నారు. వారి ప్రాణాలతో అధికారులు చెలగాటమాడున్నారు. వారికి ఏ మైన జరిగితే అధికారులే బాధ్యత… పలుమార్లు ఇళ్లు ఖాళీ చేయాల్సింది గా నోటీసులు ఇచ్చారు. కానీ అసలు పనిని మాత్రం మరిచారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వెంట నే చర్యలకు ఉపక్రమించాలి.
– సామాజిక వేత్త మనోహర్‌బాబు

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి…

ట్యాంక్ పరిస్థితి చూస్తే భయం గొలుపుతోంది. క్రమంగా బలహీనమవుతోంది.. పరిస్థితి చూస్తే ఏ క్షణంలో కూప్పకూలేందుకు సిద్దంగా ఉంది. అధికారులు నిర్లక్షాన్ని విడి.. ప్రజల ప్రా ణాలకు విలువ ఇవ్వాలి.. చాన్నాళ్లు గా ట్యాంక్ వృధాగా ఉంది. ఎందుకు కూల్చడం లేదు.. ఎన్నాళ్లు ఇలా తాత్సారం చేస్తారు.. బస్తీవాసులను ఖాళీ చేయించి ట్యాంక్‌ను నేలమట్టం చేయాలి.

Water Overhead Tank in Dilapidated at Nampally
                                                                                – సంఘ సేవకులు  జీఎస్ శివకుమార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News