Saturday, April 27, 2024

వైరస్ కన్నా స్కూళ్ల మూత డేంజర్..

- Advertisement -
- Advertisement -

వైరస్ కన్నా స్కూళ్ల మూత డేంజర్
పిల్లలను బడికి పంపాలన్న బ్రిటన్ ప్రధాని

we are not closing Schools during Corona: UK PM

లండన్ : పిల్లలను పాఠశాలలకు తిరిగి పంపించడం అత్యంత ముఖ్యమైన విషయం అని తల్లిదండ్రులకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపు నిచ్చారు. సుదీర్ఘ కోవిడ్ 19 లాక్‌డౌన్‌తో పలు దేశాలతో పాటు బ్రిటన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. చాలా కాలంగా బ్రిటన్‌లో పాఠశాలలు నడవకపోవడం, దీనితో విద్యార్థుల చదువులు దెబ్బతినడం పట్ల ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా లేమి పరిణామం ఆ భయానక కరోనా వైరస్ కన్నా నష్టం కల్గిస్తుందని జాన్సన్ అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని తొలిసారిగా ఈ విషయంపై బ్రిటన్‌లోని తల్లిదండ్రులకు తిరిగి స్కూళ్లకు పంపించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాధేయపడ్డారు. దేశంలో పలు ప్రాంతాలో వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. దీనితో నూతన విద్యాసంవత్సరం ఆరంభం కావాల్సి ఉంది. సరికొత్తగా చిన్న పిల్లలు ఇతరత్రా విద్యార్థుల స్కూళ్లు ప్రారంభం అయ్యితీరాలి.

ఈ దశలో ప్రధాని అప్పీలు ప్రాధాన్యతను సంతరించుకుంది. స్కాట్‌లాండ్ తరువాత నార్తర్న్ ఐర్లాండ్ తరువాత దేశ ప్రధాన ప్రాంతాల్లో చివరికి వేల్స్‌లో వచ్చే వారం నుంచి స్కూళ్లు ప్రారంభం కావాలి. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసరు, బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇతర వైద్యాధికారుల సంయుక్త ప్రకటనను ఈ సందర్భంగా ప్రధాని తల్లిదండ్రుల దృష్టికి తెచ్చారు. అందులోని అంశాలను చదివి విన్పించారు. కరోనా వైరస్‌తో దేశంలోని చిన్నపిల్లలు ప్రత్యేకించి స్కూళ్లకు వెళ్లే ఈడు పిల్లలకు తలెత్తిన ముప్పు తక్కువస్థాయిలోనే ఉందని, అయితే కోవిడ్ నిబంధనల పేరిట వారిని స్కూళ్లకు దూరంగా పెట్టడం వల్ల ఇతరత్రా పలు అనర్థాలు తలెత్తుతాయని ఉన్నతాధికారులు విశ్లేషించిన విషయాన్ని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తమ విజ్ఞాపనలో ప్రధాని వివరించారు.

we are not closing Schools during Corona: UK PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News