Sunday, May 5, 2024

ఆర్‌టిసి జెఎసి నుంచి వైదొలగుతున్నాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సమ్మె అనంతరం నెలకొన్న పరిస్థితులు నేపథ్యంలో టిఎస్ ఆర్‌టిసి జెఎసి నుంచి బయటకు వస్తున్నామని, ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మె అనంతర పరిస్థితులపై పూర్తి అధ్యయనం చేసి సమావేశాలు నిర్వహించాలని అనుకున్నా… అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందన్నారు. కార్మిక వర్గం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంటే జెఎసిగా చూస్తూ ఉండటం మినహా ప్రత్యక్ష, పరోక్ష కార్యాచరణ చేయలేక పోవడం బాధాకరమన్నారు. తాము జెఎసి నుంచి వైదొలుగుతున్న అంశంపై జెఎసి కన్వీనర్‌కు ఈ నెల 3న లేఖ అందచేసినట్లు చెప్పారు. యూనియన్ల వెరిఫికేషన్ 2 సంవత్సరాల వరకు లేదని ప్రభుత్వం చెబుతున్నా జెఎసిగా ఎటువంటి నిరసన తెలియచేయలేకపోయామన్నారు. సుదీర్ఘకాలం పాటు జెఎసి ఏర్పాటు చేసి ఉద్యమాన్ని సాగిస్తున్న సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు.

We are withdrawing from RTC JAC: K Raji Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News