Thursday, May 16, 2024

ఆ నిందితులను కాపాడే ప్రయత్నం చేయలేదు:సిట్

- Advertisement -
- Advertisement -

We don't help to Accused in Gujarat Riots Case: SIT

న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002)పై విస్తృతమైన, నిష్పక్షపాతమైన, సమర్ధవంతమైన దర్యాప్తు జరిపామని, నిందితులను కాపాడే యత్నం చేయలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. 275 మంది వ్యక్తులను విచారించామని పేర్కొంది. జకియా జఫ్రీ ఆరోపించిన విధంగా బారీ కుట్ర జరిగిందనే అభిప్రాయానికి రావడానికి తగిన ఆధారాలు లభ్యం కాలేదని వివరించింది. అల్లర్లపై సమర్పించిన తమ నివేదికను సమర్థించుకుంది. 2002 ఫిబ్రవరి 28 న అహ్మదాబాద్ లోని గుల్బర్గా సొసైటీలో జరిగిన హింసాత్మక ఘటనలో మృతి చెందిన వారిలో కాంగ్రెస్ నేత మాజీ ఎంపి ఎహసాన్ జఫ్రీ కూడా ఉన్నారు.

ఈ కేసులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సహా 64 మందికి క్లీన్ చిట్ ఇస్తూ సమర్పించిన సిట్ నివేదికను సవాల్ చేస్తూ ఎహసాన్ జఫ్రీ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె 2018 లో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్,జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రెండు రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. సిట్ తరఫున బుధవారం సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. 2002 ఫిబ్రవరి 27 న గోద్రాలో రైలు దహనం మొదలు వరుసగా చోటు చేసుకున్న ఘటనలను వివరించారు. సిట్ తన విధులను సక్రమంగా నిర్వహించలేదన్న జకియా జఫ్రీ ఆరోపణలను తోసిపుచ్చారు.

We don’t help to Accused in Gujarat Riots Case: SIT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News