Tuesday, May 21, 2024

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యేలా ఫోర్స్ చేస్తాం: మల్లిఖార్జున ఖర్గే

- Advertisement -
- Advertisement -

 

Mallikarjun Kharge

బెంగళూరు: ’పాన్ ఇండియా అప్పీల్’ ఉన్న రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేలా ఫోర్స్ చేస్తామని ఆ పార్టీ ప్రముఖ నాయకుడు ఎం. మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలంటే అతడు దేశవ్యాప్తంగా బాగా తెలిసినవాడై ఉండాలని, అలాంటి లక్షణం రాహుల్ గాంధీకే ఉందని ఆయన తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఆయన అందరికీ బాగా తెలిసిన వాడని  ఖర్గే చెప్పుకొచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీ కాక యోగ్యుడైన వేరే వ్యక్తి ఎవరున్నారో చెప్పండి’ అని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను త్వరలో చేపట్టనుందని కూడా ఆయన తెలిపారు. 2019లో పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి సోనియా గాంధీయే ఆరోగ్యం బాగాలేకున్న పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ వస్తోంది. గెలుపోటములు సహజం. కానీ రాహుల్ గాంధీ తన సత్తా చూపకుండా దూరదూరంగా పారిపోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బిజెపి కూడా ఎన్నోసార్టు ఓడిపోయి కూడా ‘ఒక్క ఛాన్స్ మాకిచ్చి చూడండి’ అంటూ దేబురించి మరీ అధికారాన్ని స్వంతం చేసుకుందన్నది ఇక్కడ గమనార్హం. నిజానికి పార్టీ పగ్గాలు తీసుకుని పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఇప్పుడెంతో ఉంది. జీవితంలో ఆయన ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు తన సత్తా చాటుతారన్నది కాంగ్రెస్ అభిమానులలో ఉదయిస్తున్న ప్రశ్న. ఈసారి కాంగ్రెస్ అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఇక ఆ పార్టీకి ఎన్నడూ అవకాశం రాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News