Saturday, May 4, 2024

కర్నాటకలో ఎవరు గెలుస్తారు?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలు రేపు( మే 13న) వెలువడనున్నాయి. ప్రధానంగా పోటీలో కాంగ్రెస్, బిజెపి, జెడి(ఎస్) ఉన్నాయి. చాలా వరకు ఎన్నికల అంచనాలు కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నాయి. కర్నాటక అసెంబ్లీలో 224 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మెజారిటీ మార్క్ 113. శనివారం సాయంత్రం కల్లా తుది స్పష్టమైన స్థితి తెలియగలదు.

కీలక అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలు ఇవి:
వరుణ -సిద్దరామయ్య(కాంగ్రెస్)
కనకపుర -డికె. శివకుమార్(కాంగ్రెస్)
షిగ్గావ్ -బసవరాజ్ బొమ్మై(బిజెపి)
హుబ్లీ-దార్వాడ్- జగదీశ్ షెట్టర్(కాంగ్రెస్)
చన్నపట్న- హెచ్.డి.కుమారస్వామి(జెడిఎస్)
షికారిపుర -విజయేంద్ర(బిజెపి)
చిట్టపుర్- ప్రియాంక ఖర్గే(కాంగ్రెస్)
చిక్‌మంగళూర్- సిటి. రవి(బిజెపి)
రామనగర- నిఖిల్ కుమారస్వామి(జెడిఎస్)

ఎన్నికల ధోరణికి సూచికగా పరిగణించబడే సీట్లు… కర్నాటకలోని ఎనిమిది బెల్‌వెదర్ స్థానాలను పరిశీలించండి. అవి:
శిరహట్టి
యెల్బుర్గా
జేవర్గి
గడగ్
హరపనహళ్లి
బైందూర్
తరికెరె
దావణ్‌గెరె

కర్నాటక ఓట్ల లెక్కింపు ఉదయం 6.00 గంటల నుంచే న్యూస్ ఛానెళ్లు, యూట్యూబ్‌లోనూ టెలికాస్ట్ చేయనున్నాయి. చాలా వరకు ప్రధాన ఛానెళ్లు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నాయి. కొన్ని ఛానెళ్లు ట్రెండ్, అలాగే విశ్లేషణల అప్‌డేట్స్ కూడా ఇవ్వనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News