Monday, April 29, 2024

జెడి(ఎస్) చేతులు కలుపనున్నది కాంగ్రెస్‌తోనా లేక బిజెపితోనా?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ప్రధాన పార్టీలు మెజారిటీ సీట్లు గెలువకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు జనతాదళ్(ఎస్) మద్దతు తీసుకోక తప్పదు. జెడి(ఎస్) కింగ్‌మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ఎంఎల్‌ఏలకు ఎరవేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. కాగా తన ఎంఎల్‌ఏలను గుప్పిట్లో పెట్టుకోడానికి జెడి(ఎస్) కూడా సిద్ధమైంది.

మాజీ ప్రధాని హెచ్.డి.దేవె గౌడ వ్యక్తిగతంగా అన్ని చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక రిలాక్స్ కోసం ఆయన సింగపూర్ వెళ్లారని సమాచారం.

కర్నాటకలో కన్నా సింగపూర్ నుంచే బేరసారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన కుమారస్వామికి ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎందుకంటే రేపు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి నిమిషం గోరంతలు కొండంతలు చేస్తూ విశ్లేషణలు ఉండనున్నాయి. జెడి(ఎస్)కు కూడా గణనీయమైన సీట్లు రానున్నాయని అనుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు తగ్గితే, అప్పుడు జెడి(ఎస్) ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మద్దతునిస్తానని అనవచ్చు. బిజెపితో కూడా చేతులు కలవడానికి జెడి(ఎస్)కు అభ్యంతరాలు ఏవి లేవనే తెలుస్తోంది.

2019లో బిజెపి కాంగ్రెస్, జెడి(ఎస్) నుంచి 17 ఎంఎల్‌ఏలను తనవైపుకు లాక్కుంది. దీని దృష్టా కాంగ్రెస్ సీట్లు తక్కువ అయితే ఏం చేయాలన్నది కూడా ఆలోచిస్తోంది. దానికో దూకుడు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. దేవె గౌడ, కుమార స్వామి తమ పార్టీ అభ్యర్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ నుంచి వచ్చి జెడి(ఎస్) టికెట్‌పై పోటీచేసిన అభ్యర్థులతో టచ్‌లో ఉన్నారు.

On tenterhooks

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News