Tuesday, May 21, 2024

పచ్చనికాపురంలో పార్టీ మార్పు చిచ్చు

- Advertisement -
- Advertisement -

Wife of BJP MP into TMC Upset husband Soumitra Wants divorce

 

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి, బిజెపి రాజకీయ కయ్యం ఇప్పుడు ఓ ఎంపి దాంపత్య బంధం తెగతెంపులకు దారితీసింది. బిజెపి ఎంపి సౌమిత్రా ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్ సోమవారం బిజెపి వీడి టిఎంసిలో చేరారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని ఇందుకు నిరసనగానే తిరిగి తాను టిఎంసి గూటికి చేరుతున్నానని తెలిపారు. టిఎంసి సీనియర్ నేత సౌగతారాయ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకునారు. విషయం తెలుసుకున్న భర్త , ప్రస్తుత బిజెపి ఎంపి సౌమిత్ర కోపోద్రిక్తుడు అయ్యాడు. విడిగా విలేకరుల సమావేశం పెట్టారు. తాను భార్యకు విడాకుల నోటీసు పంపిస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఈ ఎంపి కూడా ఇంతకుముందు టిఎంసిలో చురుకైన నేతగానే ఉన్నారు. 2014 పార్లమెంటరీ ఎన్నికలలో బిష్ణూపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున గెలిచారు.

అంతకు ముందు బిజెపి అనుబంధ యువమోర్చా నేతగా కూడా ఉన్నారు. భార్య సుజాత భర్తకు టిఎంసి తరఫున ముందుకు సాగేందుకు బాగా సహకరించారు. గత ఎన్నికలలో భర్త గెలుపు బాధ్యత అంతా నెత్తిన వేసుకుని తిరిగారు. క్రిమినల్ కేసులలో బెయిల్‌కు షరతుగా ఆయన నియోజకవర్గంలోకి ప్రవేశించరాదని కోర్టు ఆంక్షలు విధించడంతో భర్త తరఫున సుజాతనే భర్త సౌమిత్ర అయినంత పనిచేసి ప్రచారం సాగించారు. తరువాత దంపతులు బిజెపిలో చేరారు. ప్రధాని మోడీతో కలిసి సుజాత ఖాన్ వేదికలపై కూడా ప్రచారం సాగించారు. అయితే భర్త విజయం కోసం తాను అనేక రిస్క్‌లను భరించానని, అయితే బిజెపిలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని సుజాత వాపోయింది. అలక వహించిన సుజాత టిఎంసిలో చేరారు. బిజెపిలో కొత్త వారికి, అందులోనూ అసమర్థులు, పైగా అవినీతిపరులకు పెద్ద పీట వేస్తున్నారని సుజాత మండిపడ్డారు.

పదేండ్ల బంధం తెగినట్లే : సౌమిత్రా

‘రాజకీయాల కారణంగా పది సంవత్సరాల వైవాహిక బంధం బెడిసికొట్టింది. జరగకూడనిదే జరిగింది. ఇప్పుడు ఆమెతో విడిపోతున్నా. ఇక బిజెపి కోసం మరింత పట్టుదలతో పాటుపడుతా’ అని సౌమిత్రాఖాన్ విడిగా జరిపిన విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్య బాటలో తాను టిఎంసిలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు బూటకమని ఖండించారు. భార్యకు దూరం అవుతుండటం తనకు బాధ కల్గిస్తోందని సౌమిత్రా పెట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News