Tuesday, April 30, 2024

అధికారంలోకి వస్తే అగ్నీపథ్ రద్దు చేస్తాం: మల్లికార్జున్ ఖర్గే

- Advertisement -
- Advertisement -
  • పాత రిక్రూట్‌మెంట్ విధానం తెస్తాం
  • సాయుధ బలగాల నియామకాల్లో యువతకు ‘అన్యాయం’
  • కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
  • సుమారు 2 లక్షల మంది యువత భవిత అనిశ్చితం
  • రాష్ట్రపతి ముర్ముకు ఖర్గే లేఖ

న్యూఢిల్లీ : ‘అగ్నీపథ్’ సైనిక రిక్రూట్‌మెంట్ పథకం విషయమై కేంద్ర ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కాంగ్రెస్ సోమవారం మరింత ఉద్ధృతం చేసింది. యువజనులకు ‘పూర్తి అన్యాయం’ జరుగుతోందని పార్టీ ఆరోపించింది. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే పాత రిక్రూట్‌మెంట్ విధానాన్ని తిరిగి తెస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ‘అగ్నీపథ్’ పథకాన్ని 2022లో ప్రారంభించగా, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో నెగ్గిన దాదాపు రెండు లక్షల మంది యువజనులకు నియామక పత్రాలు జారీ చేయాలని కాంగ్రెస్ కోరింది. ‘అగ్నీపథ్’ పథకం కారణంగా సాయుధ బలగాలలో రెగ్యులర్ ఉద్యోగాలు కోరుతున్న యువజనులకు ‘ఎంతో అన్యాయం’ జరిగిందని ఖర్గే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక లేఖలో తెలియజేశారు. వారికి న్యాయం చేకూర్చాలని ముర్ముకు ఖర్గే విజ్ఞప్తి చేశారు.

సాయుధ బలగాలలో రెగ్యులర్ నియామక ప్రక్రియ రద్దు వల్ల సుమారు రెండు లక్షల మంది యువజనులకు భవిత అనిశ్చితంగా మారిందని ఖర్గే సాయుధ బలగాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ముర్ముకు తన లేఖలో తెలిపారు. ‘అగ్నీపథ్ పథకంలో సువిదిత సమస్యలు అనేకం ఉన్నాయి. సైన్యానికి అగ్నీపథ్ ‘విస్మయం కలిగించింది’ అని, ఇక ‘నౌకా, వైమానిక దళాలకైతే అది దిగ్భ్రాంతి కలిగించింది’ అని సైనిక దళాల మాజీ అధికపతి జనరల్ ఎంఎం నరవణె రాశారని ఖర్గే తన లేఖలో ముర్ముకు నివేదించారు. ‘అంతే కాదు. అదే విధమైన జవాన్ల కేడర్‌ల సృష్టి ద్వారా మన జవాన్ల పట్ల ఆ పథకం వివక్షాపూరితంగా ఉంది.

నాలుగు సంవత్సరాల సర్వీస్ అనంతరం అగ్నివీర్‌లలో అధిక సంఖ్యాకులను అనిశ్చిత ఉద్యోగ మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. దాని వల్ల సామాజిక సుస్థిరత ప్రభావితం అవుతుందని కొందరు వాదించారు’ అని ఖర్గే తన లేఖలో వివరించారు. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో ఖర్గే లేఖను అనుసంధానిస్తూ, ‘న్యాయం కోసం పోరాటంలో దేశభక్తి, ధైర్యసాహసాలు పూర్తిగా ఉన్నసైనిక అభ్యర్థులకు మేము దన్నుగా ఉన్నాం’ అని తెలిపారు. ‘అగ్నివీర్ పథకం తీసుకురావడం ద్వారా లక్షలాది మంది యువజనుల కలలను బిజెపి ప్రభుత్వం ఛిద్రం చేసింది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News