Home తాజా వార్తలు అంబర్ పేటలో ప్రైవేటు స్కూళ్లో మహిళ మృతదేహం….

అంబర్ పేటలో ప్రైవేటు స్కూళ్లో మహిళ మృతదేహం….

 

Women dead body in private school at amberpet/
హైదరాబాద్: ఓ ప్రైవేటు స్కూల్‌లో ఓ మహిళ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న సంఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతం గోల్నాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెంట్ అంబర్ స్కూల్ గేటు వేసి ఉన్నా పాఠశాల లోపల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం కుళ్లిపోయి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.