Wednesday, May 15, 2024

రిజర్వ్ డే లేక పోవడంపై విమర్శలు

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో రిజర్వ్‌డే లేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత్‌ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరిగిన టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ సమరం వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగక తప్పలేదు. ఇక, భారత్ మ్యాచ్ బరిలోకి దిగక పోయినా మెరుగైన పాయింట్ల ఆధారంతో ఫైనల్‌కు చేరుకుంది. కాగా, నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను కేటాయించక పోవడంపై విమర్శలు వస్తున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్‌వా, పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు వాన్, నాసిర్ హుస్సేన్, బోథమ్, పీటర్సన్ తదితరులు ఐసిసి తీరును ఎండగట్టారు. ఇక, భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సయితం రిజర్వ్ డే లేక పోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక్క బంతి కూడా ఆడకుండానే ఫైనల్‌కు చేరడం తనకు ఏమాత్రం సంతృప్తి కలిగించలేదని స్పష్టం చేసింది. ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లలో నాకౌట్ మ్యాచ్‌లకు కచ్చితంగా రిజర్వ్‌డే ఉంచాలని నిబంధనలు ఉన్నా ఐసిసి దాన్ని పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Womens T20 World Cup:Criticises ICC for No Reserve day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News