Tuesday, April 30, 2024

పరిశ్రమల అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్/కాగజ్‌నగర్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధ్దికి కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కారించుకోని మంగళవారం పారిశ్రామిక ప్రగతి దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్‌పిఎం క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, చాహత్‌భాజ్‌పాయ్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవలక్ష్మి,ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధ్ది చేసేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పెట్టుబడి రాయితీ, అమ్మకపు పన్ను, విద్యుత్ వాడకం చార్జీలు, పారిశ్రామిక భూమి కొనుగోలు రాయితీలు, ఉద్యోగ నైపుణ్యాభివృద్ధి కోసం ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల ఖర్చుపై రాయితీ, మహిళా పారిశ్రామికులకు అదనపు ప్రోత్సహకాలం లాంటి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

జిల్లాలో చిన్న పరిశ్రమలు, జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల ద్వారా రైతులకు, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో భారీ పరిశ్రమలు అయిన సిర్పూర్ కాగితం మిల్లు మూతపడిన తరువాత తెలంగాణ ప్రభుత్వంలో అత్యధిక రాయితీ ప్రకటించి పునఃప్రారంభించడం జరిగిందని, ఈ నేపథ్యంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యుల్డ్ తెగలు, దివ్యాంగ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఎన్నో రాయితీ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. గత దశాబ్ద కాలంలో జిల్లాలో టి ఫ్రైడ్, టిఎస్‌ఐ పాస్ పథకాల ద్వారా ఎన్నో పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, నూతన పరిశ్రమల స్థాపనకు జిల్లాలోని అన్ని మండలాలలో అనుకూల వాతావరణం నెలకోని ఉందని తెలిపారు. అనంతరం ఐటి, ఈసి విభాగంలో మీ సేవలో అధిక లావాదేవిలు చేసిన, అధార్ సర్వీసులు చేసిన జిల్లాలోని మీ సేవ నిర్వాహకులకు ద్రువపత్రాలు అందజేశారు.

వివిధ పరిశ్రమలలో పని చేస్తున్న ఉత్తమ కార్మికులను సన్మానించారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు చేసిన ప్రదర్శనలు అందరిని అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి రఘు, జిల్లా ఈడిఎం మేనేజర్ గౌతం కుమార్, ఎస్‌పిఎం ఉపాద్యక్షుడు మిశ్ర, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరిష్‌కుమార్, మార్కెట్ కమిటి చైర్మన్ కాసం శ్రీనివాస్, రైస్ మిల్లర్ల అద్యక్షులు సత్యనారాయణ, ఎస్‌పిఎం జీఎం గిరి, జిల్లాలోని పారిశ్రమికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News