Saturday, May 18, 2024

అడవి బిడ్డల సంక్షేమమం దిశగా కృషి

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి: గిరిజన అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మంగళవారం లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని బుగ్గపాడు, చెరుకుపల్లి, కాకర్లపల్లి, రేగళ్ళపాడు, రుద్రాక్షపల్లి గ్రామాలకు చెందిన 1,196 మంది రైతులకు 1,649 ఎకరాలకు పోడు పట్టాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టరు గౌతమ్, భద్రాచలం ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి పోట్రు గౌతమ్, డిఎఫ్‌ఓ సిద్దార్ధ్ విక్రమ్ సింగ్‌లతో కలసి పోడు భూముల పట్టాలు పంపిణీ చేసారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో ఎన్నో అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేసిందని, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పోడు భూములను సాగు చేసుకున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షల 51 వేల 146 మంది పోడు రైతులకు పట్టాలు అందించడం జరుగుతుందని తెలిపారు. 2006 ఆటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 కు ముందు వరకు సాగు చేస్తున్న వారిని అర్హులుగా గుర్తిస్తూ పోడు పట్టాలను అందించడంతో పాటు పట్టాలు అందుకున్న వారందరికి ఈ వానాకాలం నుండే రైతుబంధును అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో బం జారాల, అదివాసుల అత్మగౌరవాన్ని సమున్నతంగా చాటే విధంగా రాష్ట్ర రాజధాని హైద రాబాద్‌లో అత్యంత ఖరీదైన స్థలాన్ని కేటాయించి 50 కోట్ల రూపాయలతతో సంత్ సేవాలాల్ బంజార భవన్, కుమ్రంభీం ఆదివాసి భవన్‌గా నిర్మించడం జరిగిందని తెలిపారు. గిరిజనుల పండుగలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, 350 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేడారంలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు.

అడవి బిడ్డల సంక్షేమమం దిశగా తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జడ్పిటిసి సభ్యులు కూసంపూడి రామారావు, జిల్లా గ్రంధాలయం అధ్యక్షులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ డివిజన్ కమిటీ అధ్యక్షులు వనమా వాసు, టిఆర్‌ఎస్ మండల కమిటీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News