Sunday, April 28, 2024

అటువైపు మరో తుపాన్

- Advertisement -
- Advertisement -

'Yaas' Cyclone will hit coast of West Bengal and Odisha on 26 May

26న బెంగాల్‌కు యాస్

న్యూఢిల్లీ : మరో తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి ‘యాస్’ తుపాన్ పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలను తాకుతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. అరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్టే తుపాన్ ప్రభావంతో పలు రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. ఇది సమసిపోకముందే బెంగాల్, ఒడిషాకు యాస్ తుపాన్ తాకనుంది. సముద్రంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ తుపాన్‌గా మారుతుంది, తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వివరించింది. వచ్చే రెండు రోజులలోనే నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతం, సమీప బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతాలకు చేరుకుంటాయని ఐఎండి నిర్థారించింది. తరువాతి క్రమంలో అవి విస్తరిస్తాయి. ఇప్పటి ఇంతకు ముందటి అంచనాల మేరకు జూన్ 1 నాటికే కేరళకు రుతుపవనాలు రావల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News