Monday, April 29, 2024

తాళి కట్టే ముందు వరుడు మాయం… మరో యువకుడితో

- Advertisement -
- Advertisement -

Marriage cancel groom marry another men

లక్నో: పెళ్లిలో తాళి కట్టే ముందు వరుడికి వివాహం ఇష్టం లేదని పారిపోవడంతో మరో యువకుడితో పెళ్లి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా మహరాజ్‌పూర్‌లో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. పెళ్లి కుమార్తె ముస్తాబై కళ్యాణ మండపానికి చేరుకుంది. వరుడు కూడా తన బంధువులతో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వధువు-వరుడుని పెళ్లి మండపంలో పంతులు మంత్రోచ్ఛరణ చేస్తున్నాడు. పెళ్లి తంతు జరుగుతూనే ఉంది. వధువరులు పెళ్లి దండలు మార్చుకున్నారు. తాళి కట్టే సమయంలో పెళ్లి కుమారుడికి బదులుగా మరోక వ్యక్తి ఆమె మెడలో తాళి మూడుముళ్లు వేశాడు. తాళ్లి కటే సమయంలో వరుడు పెళ్లి ఇష్టం లేదని మండపం నుంచి పారిపోయాడు. బంధువులలో ఒక యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వెంటనే వధువు మెడలో మూడు ముళ్లు వేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News