Saturday, May 18, 2024

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో యువత మంచి, చెడు తెలుసుకొని క్రమ శిక్షణతో మెలగాలని, అప్పుడే నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించి గొప్ప స్థానానికి చేరుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు పొందే దుఖఃం వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచే దూరంగా ఉండాలని తెలిపారు.

నేటి యువత రేపటి భావి భారత పౌరులని, డ్రగ్స్‌కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సమాజంలో పెరుగుతున్న సాంకేతికత కారణంగా చిన్న పిల్లలు సెల్ ఫోన్ వాడకం పెరగడం వల్ల ఆలోచనా విధానం మారిపోతుందని, దీని వల్ల అనేక నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఒక పరిణతి వచ్చే వరకు సెల్ ఫోన్ ఇవ్వకపోవడం మంచిదని, ప్రతి ఇంట్లో పిల్లల ఫోన్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

యువత డ్రగ్స్‌తో పాటు గుట్కా, గంజాయి, మాదకద్రవ్యా లు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు సైతం దూరంగా ఉండాలని, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం ఆలోచన శక్తి నశిస్తాయని అన్నారు. తల్లిదండ్రు లు పిల్లలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తాము కష్టాలు పడుతూ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తారని , వా టిని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోవద్దని, మనం చె డుఅలవాట్లకు గురైతే తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతమని, ఇది గుర్తించుకొని యువత మెలగాలని కలెక్టర్ హితవు పలికా రు. అనంతరం మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్ నివారణ కోసం రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిడబ్లూఓ వేణుగోపాల్, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ రవిబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News