Sunday, May 5, 2024

కాంగ్రెస్ కసరత్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన పీఈసీ కమిటీ రెండో సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు జరిపింది. నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ప్రాధాన్యతా సంఖ్యలను పిఈసీ సభ్యులు కేటాయించారు. అయితే ఈ సమావేశం ప్రారంభానికి ముందు గాంధీభవన్ కు వచ్చిన పిఇసి సభ్యులందరికి తమకు మద్ధతు తెలపాలని ఆశావహులు విజ్ఞప్తి చేశారు. ఎంట్ర న్స్ గేట్ వద్ద నిలబడి తమకు ఓటు వేయాలని పి ఇసి సభ్యులను ఆశావహులు వేడుకున్నారు. ప లువురు పిఇసి సభ్యులు అభ్యర్ధుల వివరాలు తీ సుకొని సమావేశానికి వెళ్లారు. ఇదిలా ఉండగా ఒక్కో అభ్యర్ధికి పీఈసీ కమిటీ నుంచి కనీసం 40 శాతం ఓటింగ్ అవసరం ఉంటుంది. 28 మంది సభ్యులున్న పిఇసి కమిటీలో 12 మంది మినిమం టిక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆశావహులం తా తమకు టిక్ చేయాలని గాంధీభవన్ గేటు వద్ద సభ్యులను విజ్ఞప్తి చేయడం విశేషం.
ముగ్గురు సభ్యుల గైర్హాజరు
కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందు కు కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టిపిసిసి అధ్యక్షుడు, పీఈసీ చైర్మన్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన ఎలక్షన్ కమిటీ రెండో సమావేశం ముగిసింది. ఇందులో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ భేటీకి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, గీతారెడ్డిలు గైర్హాజరయ్యారు.
తమకే తొలి ప్రాధాన్యత సంఖ్య ఇవ్వాలి
అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల కమిటీ ప్రాథమిక కసరత్తు చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావహులకు ప్రాధాన్యతా సంఖ్యలు కేటాయించింది. మరోవైపు టికెట్ల కోసం.. ఎన్నికల కమిటీలోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. తమకే తొలి ప్రాధాన్యత సంఖ్య ఇవ్వాలని పలువురు సభ్యులు మిగతా సభ్యులను కోరారు. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యత ఓటు కోసం నేతలు మిగతా వారి మద్దతు కోరడం విశేషం.
నేటి నుంచి 3 రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ సమావేశం
నేటి నుంచి మూడు రోజుల పాటు టిపిసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు జి.గణేశ్ మేవాని, సిద్దిఖీలు అందుబాటులో ఉంటారు. నేడు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో స్క్రీనింగ్ కమిటీ ముఖాముఖి సమావేశమవుతారు. ఈ నెల 5న డిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపిలు, మాజీ మంత్రులతోనూ ఈ కమిటీ చర్చించనుంది. అనంతరం ఆరో తేదీన స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది.ఈ స్క్రీనింగ్ పూర్తయ్యాక ఏఐసికి జాబితాను పంపిస్తారు. తదనంతరం ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
25 మందికి టిక్‌తో పాటు సంతకం కూడా..
ఆదివారం జరిగిన పిఈసి సమావేశంలో 25 నియోజక వర్గాలకు సం బంధించి అభ్యర్థుల విషయంలో సభ్యులందరూ ఏకభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో అందరూ ఆయా అభ్యర్థుల జాబితాకు సంబంధించి టిక్ చేయడంతో పాటు సంతకాలు కూడా చేసినట్టు గా తెలిసింది. అయితే ఇదంతా తప్పని, కొందరు కావాలనే ఇలాంటి త ప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పిఈసి సభ్యులు పేర్కొనడం గమనార్హం. అయితే ఈ 25 నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఏకభిప్రాయానికి వచ్చిన వారిలో అధికంగా పిఈసి సభ్యులకు సం బంధించిన టికెట్‌లే ఉన్నాయని తెలుస్తోంది. కానీ, ఈ వార్తను సభ్యులు ఖండించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News