Tuesday, May 14, 2024

మిణుగురులు

- Advertisement -
- Advertisement -

రచయిత్రి, అనువాదకురాలు,కవయిత్రి అర్విందర్ కౌర్ పంజాబ్ లోని డెర బస్సి ప్రభుత్వ కళాశాల నుండి ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు.చండీఘర్ లోని PGGCGలో ఇంగ్లిషు సాహిత్యం, మీడియా స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలు అందించడమే గాక దగ్గరదగ్గర 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ కళాశాలలో పని చేసారు.ఆమె చిన్న వయసులోనే జాతీయ ఆంగ్ల భాషా దినపత్రికలకు రాయడం ప్రారంభించారు. ఆమె మొదట ప్రచురించిన పుస్తకం పంజాబీ కవితల’ Kujh Kasoiley Supney’. ఆమె హైకు విషయంలో విశేషంగా పని చేసారు. హిందీ, ఇంగ్లిషు హైకు లోకానికి ఎక్కువగా దోహద పడ్డారు.ఆమె ప్రచురించిన పుస్తకాలలో రెండు హైకు పుస్తకాలు , Nimolian ( పంజాబీ హైకు ) మరియు పంజాబీ, ఇంగ్లిషు భాషలలో ప్రచురించిన Dandelion Seeds వున్నాయి.

ఇటీవల Cherita అనే ఒక లఘు కవితా రూపాన్ని పంజాబీ, హిందీ కవిత్వ పాఠకులకు పరిచయం చేస్తూ Under Rain Trees అనే అనువాద పుస్తకాన్ని ప్రచురించారు. ఆమె హైకులు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పత్రికలలో ముద్రితమైనవి.పంజాబీ అనువాదం లో ఆమె చేసిన కృషి గుర్తింపు పొందింది. ఆమె అనువాదం చేసిన Amrita and Imroz : In the times of Love and Longing పుస్తకం ఫుల్ సర్కిల్ ఢిల్లీ వారు ప్రచురించారు. ప్రముఖ పంజాబీ కవయిత్రి పాల్ కౌర్ కవిత్వాన్ని ఇటీవల The Wild Weed : Selected Poems పేర ఇంగ్లిషులోకి అనువదించి ప్రచురించారు. ఆమె తన కుటుంబంతో చండీఘర్ లో నివశిస్తున్నారు. ఈ హైకులు ప్రముఖ ముద్రణా సంస్థ Red River ప్రచురించిన అర్విందర్ కౌర్ Fireflies in the Rubble ( March 2022 ) అను హైకు పుస్తకంలోనివి. చదివి ఆస్వాదించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News