Saturday, April 27, 2024

విదేశీ అతిథి లేకుండానే ఈసారి రిపబ్లిక్‌డే

- Advertisement -
- Advertisement -

Officials said no Foreign Guest would be invited to Republic Day

 

న్యూఢిల్లీ : ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి విదేశీ అతిథి ఎవరినీ ఆహ్వానించడంలేదని అధికారికవర్గాలు తెలిపాయి. ఈ నెల 26న ఢిల్లీలో 72వ రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ఈసారి రిపబ్లిక్‌డేకు ఆహ్వానించగా, కొవిడ్ కొత్త స్ట్రెయిన్ కారణంగా రాలేకపోతున్నానని ఆయన వెల్లడించారు. దాంతో, ఈసారి విదేశీ అతిథి లేకుండానే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. చివరిగా 55 ఏళ్ల క్రితం విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్ డే జరిపారు. 1966 జనవరి 11న అప్పటి ప్రధాని లాలుబహదూర్‌శాస్త్రి మరణించగా, జనవరి 24న ఇందిరాగాంధీ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది విదేశీ అతిథిని పిలవకుండానే రిపబ్లిక్ డే నిర్వహించారు. అంతకుముందు 1952లో, 1953లోనూ విదేశీ అతిథి లేకుండానే రిపబ్లిక్ డే నిర్వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News