Wednesday, May 1, 2024

నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్!

- Advertisement -
- Advertisement -

1/3rd of urban Indians Covid positive by December 2020

గత డిసెంబర్ నాటికి పరిస్థితి ఇది
ఇప్పుడు ఈ శాతం ఇంకా ఎక్కువే ఉండొచ్చు
టొరంటో యూనివర్శిటీ అధ్యయనంలో వెల్లడి
విశాఖ సహా దేశంలోని 12 నగరాల్లో శాంపిల్స్‌పై సీరో సర్వే

న్యూఢిల్లీ: 2020 డిసెంబర్ నాటికి నగరాల జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా సోకి ఉంటుందని వివిధ నగరాల్లో నిర్వహించిన సీరో సర్వేల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఎపిలోని విశాఖపట్నం సహా దేశంలోని 12 నగరాల్లో నిర్వహించిన సీరో సర్వే గణంకాల విశ్లేషణ అధారంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కెనడాలోని టొరంటో యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసెర్చ్‌కి చెందిన శాస్త్రజ్ఞులు, థైరెకేర్ లాబ్స్‌కు చెందిన ఎ వేలమణి కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం వివిధ నగరాల్లో నిర్వహించిన సీరో సర్వేలో అక్కడి జనాభాల్లో 31 శాతం మందికి కరోనా పాజిటివ్ ఉందని వారు తెలిపారు. అంటే జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి గత ఏడాది డిసెంబర్ నాటికే కరోనా సోకిందన్న మాట. కరోనా తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ శాతం మరింతగా పెరిగి ఉండవచ్చు. దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో స్వయంగా తమకు కరోనా సోకి ఉండవచ్చని భావించి పరీక్షలు చేయించుకున్న వారిలో సీరో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉండడాన్ని మేము గమనించాం. యుక్త వయస్కుల్లో దాదాపు సగం మందిలో ఇది కనిపించింది.

మరణాల గణాంకాలు, ఎంపిక చేసిన జనాభాలో ఇంతకు ముందు నిర్వహించిన సీరో సర్వేలతో ఈ ఫలితాలు సరిపోలుతున్నాయి’ అని పరిశోధకులు పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 2,200కు పైగా శాంపిల్స్ కలెక్షన్ సెంటర్ల వద్ద స్వయంగా పరీక్షల కోసం వచ్చిన వారిలో 31 శాతం మందిలో సీరో పాజిటివిటీ కనిపించింది. అన్ని వయసుల వారిలోను పురుషుల (30శాతం) కంటే మహిళల్లో (35 శాతం) ఎక్కువ సీరో పాజిటివిటీ ఉండడాన్ని వీరు గుర్తించారు. శాంపిల్స్ సేకరించిన వారంతా కూడా సామాజికఆర్థికంగా ఉన్నతస్థాయిలో ఉన్న స్వయంగా పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన వారేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజీవ్ జయదేవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా వేర్వేరు నగరాల్లో మహమ్మారి వేర్వేరు సమయాల్లో తార స్థాయిలో ఉందని , ఉదాహరణకు ఢిల్లీలో ఇది జూన్‌డిసెంబర్ మధ్య గరిష్ఠ సస్థాయిలో ఉంటే చెన్నైలో జూలైలో, పుణెలో సెప్టెంబర్‌లో పీక్ స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. మొత్తంమీద సెప్టెంబర్ మధ్యలో పుణెలో అత్యధికంగా 69 శాతం సీరో పాజిటివిటీ ఉందన్నారు. దేశం మొత్తం కరోనా కేసుల్లో మూడో వంతు ఈ 12 నగరాల్లో ఉండడం గమనార్హం.

భారీ స్థాయిలో ఉన్న సెకండ్ వేవ్‌ను కూడా కలిపితే కరోనా వైరస్ తాకిడికి గురయిన వారి శాతంఇంకా ఎక్కువే ఉంటుందని జయదేవన్ చెప్పారు. దేశంలో 77 శాతానికి పైగా కుటుంబాలు కేవలం రెండు గదులు, అంతకన్నా తక్కువలో నివసిస్తున్నారని, ఫలితంగా భౌతిక దూరానికి అవకాశం లేదని, అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువ మందికి సోకుతున్న దృష్ట్యా 90 శాతంకన్నా ఎక్కువ మందికి సోకే అవకాశం లేకపోలేదని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News