Monday, May 6, 2024

1,40,000 మంది ప్రాణాలను కాపాడిన కొవిడ్ టీకా

- Advertisement -
- Advertisement -

అమెరికాలో పరిశోధకుల వెల్లడి

1.4 Lakh lives save by vaccine

ఇండియానా పోలిస్ : ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు 49 లక్షల మందికి పైగా కొవిడ్‌కు బలయ్యారు. అలాగే ఈ విలయ తాండవం నుంచి ప్రజలను కొవిడ్ టీకాలే కాపాడుతున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కొవిడ్ టీకాలు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో ఇండియానా యూనివర్శిటీపర్దూ యూనివర్శిటీ ఇండియానా పోలిస్ (ఐయూపీయూఐ) పరిశోధకులు వెల్లడించారు. అనేక అధ్యయనాల ప్రకారం ఈ ఏడాది మే 9 నాటికి 1,40,000 మంది ప్రాణాలను కొవిడ్ టీకాలు కాపాడినట్టు వెల్లడించారు. అంతేకాదు ఎన్నో విధాలుగా టీకాలు కొవిడ్‌ను సమర్ధంగా నియంత్రిస్తున్నట్టు తెలిపారు. ఇన్‌ఫెక్షన్ సోకినా తీవ్రస్థాయికి చేరుకోకుండా మరీ ముఖ్యంగా ప్రాణాపాయం నుంచి టీకాలు కాపాడుతున్నాయని తెలిపారు.

ఒక డోసు కంటే రెండు డోసులు తీసుకున్నవారిలో వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి ద్వారా ఇతరులకు కొవిడ్ వ్యాప్తి కూడా గణనీయంగా తగ్గినట్టు ఐయూపీయూఐ హెల్త్ ఎకనమిస్ట్ సుమేధ గుప్త తెలిపారు. తన బృందంతో కలిసి ఆమె అనేక పరిశోధనలు జరిపారు. వీరంతా అమెరికాలో ప్రజల ప్రాణాలను టీకాలు ఎలా కాపాడుతున్నాయన్న విషయమై అధ్యయనం చేశారు. 2021 మార్చి నుంచి ఈ బృందం పరిశోధనలు ప్రారంభించింది. అత్యధిక, అతితక్కువ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రాలను పరస్పరం పోల్చి చూస్తూ ఓ నమూనా ద్వారా పరిస్థితిని విశ్లేషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News