Monday, April 29, 2024

బసవభవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపనకోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి కాలం ప్రజా నాయకుడు బసవేశ్వరుని జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్‌లు, లింగ బలిజలు సహా రాష్ట్ర,దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. వారు జాతికి చేసిన సేవలను, వారి బోధనలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న మత చాంధస విలువలను సంస్కరిస్తూ, సాంఘీక దురాచారాలమీద పోరాటం చేయడమేకాకుండా, వర్ణ వివక్ష, కుల వివక్ష, లింగవివక్ష లేని సమాజం కోసం దాదాపు 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని సిఎం కొనియాడారు.
ట్యాంక్‌బండ్‌పై బసవేశ్వరుని కాంస్య విగ్రహం
‘అనుభవ మంటపం’ వ్యవస్థను ఏర్పాటు చేసి, అన్ని కులాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించి, నాటి కాలంలోనే పార్లమెంటరీ ప్రజస్వామిక పాలనకు బీజాలు వేశారని అన్నారు. బసవేశ్వరుని జయంతిని ఏటా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, వారి ఆశయాల సాధన దిశగా కార్యాచరణ చేపట్టిందని సిఎం తెలిపారు. బసవేశ్వరుని స్పూర్తిని రేపటి తరాలు కొనసాగించేందుకు గుర్తుగా వారి కాంస్య విగ్రహాన్ని ట్యాంకుబండ్ మీద నెలకొల్పుకున్నామని సిఎం ప్రకటించారు.

కోకాపేటలో బవస భవన్ : నగరంలోని కోకాపేటలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో బసవ భవన్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని సిఎం తెలిపారు. కుల మతాలకు అతీతంగా మనుషులంతా వొక్కటేననే బసవేశ్వరుని సమతా తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని సిఎం అన్నారు. దళిత బహుజన కులాలు, గిరిజన,మహిళా అట్టడుగు వర్గాల సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తామని చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News