Saturday, May 4, 2024

రొమేనియా కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…. 10 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

బుచారిస్ట్: రొమేనియాలోని కోవిడ్-19 ఆస్పత్రిలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ రోగులు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించారు. పియాత్రా నిమ్ కౌంటీ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు  అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకొని ఐసియులో చికిత్స పొందుతున్న కరోనా రోగులను బయటకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో పది మంది రోగులు సజీవదహనయ్యారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని మరొక ఆస్పత్రి తరలించామని రొమేనియా ఆరోగ్య శాఖ మంత్రి నీల్ టాటారూ తెలిపారు. గాయపడిన వారిలో వైద్యుడు ఉన్నాడు. 2015లో బుచారెస్ట్ లోని నైట్ క్లబ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 65 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.  రొమేనియా దేశంలో 3.53 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 8813 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా నుంచి 2.39 లక్షల మంది కోలుకోగా 1.05 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 1172 మంది ఐసియులో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News