Sunday, May 5, 2024

కేంద్ర సాయుధ బలగాల 11 వేల పాత వాహనాలు త్వరలో రద్దు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర సాయుధ బలగాల 11 వేల పాత వాహనాలన్నీ త్వరలో తుక్కుగా మారనున్నాయి. 15 ఏళ్లకు మించి వాడుకలో ఉన్న ఆటోమోబైల్ వాహనాలన్నిటినీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్ తదితర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 11 వేల పాతవాహనాలను గుర్తించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వివిధ శాఖల పాత వాహనాలన్నిటినీ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభ్యర్థించింది. పాత వాహనాలకు బదులు ఉత్తమ సాంకేతికత, ఇంధన సమర్ధ వినియోగ వాహనాలను ప్రవేశ పెట్టాలని సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News