Saturday, April 27, 2024

జల సిరుల తెలంగాణ

- Advertisement -
- Advertisement -

దేశంలో నీటి లభ్యత తక్కువ అయినా రాష్ట్రంలో
కృష్ణ-గోదావరి బేసిన్లలో 1300 టిఎంసిలు అందుబాటు

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో తలసరి నీటి లభ్యత తలసరి నీటి నిల్వ సామర్ధ్యం చాల తక్కువగా ఉందని సిఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే వెల్లడించారు. సర్ ఆర్ధర్ ధామస్ కాటన్ 220జయంతిని పురస్కరించుకొని ఆదివారం విశ్వశ్వేరయ్య భవన్‌లో నీటిలభ్యతపై జరిగిన జూమ్ మీటింగ్‌లో శ్రీధర్ దేశ్‌పాండే మాట్లాడుతూ దేశంలో ఉన్న నీటినిలువ సామర్ధంతో మూడు నెలలకు మించి కరువును ఎదుర్కోలేమన్నారు. నదులపై తగినంత నీటి నిల్వ సామర్ధం కలిగిన జలాశయాలు లేవని , నీరంతా సముద్రంలోకి వెళ్లిపోతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో తగినంత నిల్వ సామర్ధం ఏర్పాటు చేయాలన్న అంశంపై దృష్టి పెట్టలేదన్నారు. నీటినిల్వ పెంచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 141టిఎంసిలు, పాలమూరురంగారెడ్డిలో 68టిఎంసిలు ,డిండిలో 25.56టిఎంసీలు నిల్వ సామర్ధం కలిగిన జలాశయాలను ప్రతిపాదించినట్టు వెల్లడించారు.

ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ జలాశాయాలను ఏర్పాటు చేయాలని సిఎం భావిస్తున్నట్టు తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టులో నిల్వ సామర్ధం పెంచడానికి స్థలాల అన్వేషణ చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. కడెం నదిపై 5.36 టిఎంసిలకు ప్రాజెక్టును ఆమోదించారన్నారు. సదర్‌మట్ నిర్మాణం జరుగుతోందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజి నిర్మాణం కోసం మహారాష్ట్రతో ఒప్పదం కుదిరిందన్నారు. చనాకాకోరాటా బ్యారేజి పూర్తయిందన్నారు. పిప్పల్కోటి ,గోమూత్రి జలశయాల నిర్మాణానికి ఆమోదించారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నికరంగా నీటి సరఫరా కోసం దుమ్ముగూడెం ఆనకట్ట కింద 37టిఎంసిలతో సీతమ్మసాగర్ బ్యారేజిని ప్రతిపాదించినట్టు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టులో 10టిఎంసిల లింగంపల్లి జలాశయాన్ని ఆమోదించారన్నారు. సింగూరు 30టిఎంసిలు, నిజాంసాగర్ 17టిఎంసిలు, శ్రీరాంసాగర్ 90టిఎంసిలు, గౌరవెల్లి 9టిఎంసిలు ,లోయర్ మానేరు 24టిఎంసిలతో నింపడానికి , నీటి కొరత ఏర్పడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపడానికి ఏర్పాట్లు జరిగాయన్నారు.

500టిఎంసీల నిల్వ సామర్ధం :

కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్‌లో ఉన్న జలాశయాల్లో సుమారు 500టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఇవన్నీ రాష్ట్రం తలసరి నీటి లభ్యతను , తలసరి నీటి నిల్వ సామర్దాన్ని పెంచుకోవడానికి దోహదం చేసేవే అని వివరించారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి బేసిన్లలో కలిపి మొత్తం నీటి లభ్యత 1300టిఎంసిలు , నీటి నిల్వ 950టిఎంసీలు ఉన్నట్టు తెలిపారు. తెలంగాణ జనాభా 4కోట్లుగా పరిగణిస్తే తలసరి నీటి లభ్యత 920 ఘనపు మీటర్లు, తలసరి నీటి నిల్వ 672ఘనపు మీటర్లు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర నీటి నిల్వ సగటు దేశం కంటే చాల ఎక్కువగా ఉన్నప్పటికీ, సగటు నీటి లభ్యత పెంచుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా వుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా.జి బ్రహ్మారెడ్డి , ఐఎస్‌ఎన్ రాజు, సత్యనారాయణ, తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News