Sunday, April 28, 2024

‘139మంది అత్యాచారం’ కేసు సిసిఎస్‌కు బదిలీ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తొమ్మిదేళ్ల పాటు 139మంది అత్యాచారం.. ఆపై గ్యాంగ్‌రేప్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన మిర్యాలగూడ యువతి కేసును మంగళవారం సిసిఎస్‌కు బదిలీ చేశారు. ఈక్రమంలో సిసిఎస్ అధికారులు 2011 నుంచి ఇప్పటివరకు 139 మందికి నోటీసులు జారీ చేయడంతో పాటు విచారించనున్నారు. బాధిత యువతి ఫిర్యాదు ప్రకారం ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న 139 మందిని పలు దఫాలుగా స్టేషన్‌కు పిలిపించి విచారించేందుకు సిసిఎస్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే బాధిత యువతిని ఎక్కడెక్కడ ఏయే ప్రాంతాల్లో ఆ నిందితులు బలాత్కారం చేశారనేదానిపై సిసిఎస్ పోలీసులు కొంత వరకు ఆరా తీశారు. మొదటిసారి ఎక్కడ అన్యాయానికి గురి అయిందో అక్కడి నుంచి విచారించేందుకు సమాయత్తమౌతున్నారు. బాధిత మహిళ పదో తరగతి పాస్ కాగానే కుటుంబ సభ్యులు వివాహం చేశారని, ఈక్రమంలో అక్కడే మొదటిసారి అత్యాచారానికి గురి అయినట్టు ప్రాధమిక విచారణలో తేలింది.

అదేవిధంగా అత్తింట్లో లైంగిక దాడులు, మామ, సోదరుల అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని భర్తకు చెబితే పట్టించుకోలేదన్న అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకుని పుట్టింట్లో తిరిగి చదువు ప్రారంభించిన సమయంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడితో పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కారణంగా బాధిత మహిళ హైదరాబాద్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, ఇక్కడికి చేరుకున్న తర్వాత మహిళపై నిత్యం అఘాయిత్యాలు జరిగాయని, బాధిత మహిళను ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోలకతా, నాగ్‌పూర్, పుణె లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లి విద్యార్థి సంఘం నాయకుడు తన ఫ్రెండ్స్‌తో బాధిత మహిళపై రేప్ చేయించాడన్న ఆరోపణలపై సిసిఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించనున్నారు. బాధిత మహిళతో సెక్స్ చేస్తున్న సమయంలో వీడియో కూడా తీసిశారని, నగ్నంగా ఫోటోలు తీశారని ఫిర్యాదులో పేర్కొనడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. 2011 నుంచి ఇప్పటివరకు 139 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు విచారణను సిసిఎస్‌కు బదిలీ చేశారు. కాగా, బుల్లితెర యాకంర్, వర్థమాన నటుడు సైతం తనపై అత్యాచారం చేశారని బాధిత మహిళ వీడియోలు హల్‌చల్ చేస్తున్న క్రమంలో వారికి నోటీసులు ఇచ్చేందుకు సిసిఎస్ పోలీసులు సమాయత్తమవుతున్నారు.

139 Gang raped case transfered to CCS Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News