Wednesday, May 15, 2024

13వ విడత భారత్-చైనా కోర్ కమాండర్స్ భేటీ

- Advertisement -
- Advertisement -

India China talks

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత,చైనా సైనిక జనరల్స్ ఆదివారం భేటీ అయ్యారు. లడఖ్‌లోని నియంత్రణ రేఖకి చైనా వైపున మాల్డో బోర్ట్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ చర్చలు జరుగుతున్నాయి.రెండు దేశాల సైనికాధికారుల మధ్య ఇలా భేటీ జరగడం ఇది 13వసారి. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఒడ్డు నుంచి బలగాలను ఉపసంహరించుకునే విషయంపై ఈ చర్చలు  ప్రధానంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ చర్చల్లో 14వ కోర్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ పిజికె మీనన్ భారత్ తరఫున పాల్గొన్నారు. ఈ చర్చల్లో భారత్‌లోకి చైనా బలగాల చొరబాట్లను ప్రస్తావించనున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో మాట్లాడిని మూడు వారాలకు ఈ చర్చ జరుగుతోంది. చైనా వైపు నుంచి మొహరింపు ఏ మాత్రం ఆగలేదని ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ ఎంఎం సరవణే శనివారం స్పష్టంచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News