Monday, April 29, 2024

పాక్ అణు కార్యక్రమ పితామహుడు అబ్దుల్ ఖదీర్ ఖాన్ అస్తమయం

- Advertisement -
- Advertisement -

AQ KHAN

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణు కార్యక్రమ పితామహుడైన ఏక్యూ ఖాన్ ఆదివారం అనారోగ్యకారణంగా కన్నుమూశారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. 2004లో ఆయన అణ్వస్త్ర సాంకేతికత వ్యాప్తిని అంగీకరించడంతో విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జీవితాంతం అధికారికంగా హౌజ్ అరెస్టయ్యారు.

అబ్దుల్ ఖదీర్ ఖాన్ 1936లో భోపాల్‌లో జన్మించారు. తర్వాత 1947లో దేశవిభజనప్పుడు పాకిస్థాన్‌కు తన కుటుంబంతో వెళ్లిపోయారు. ఆయన ఆదివారం ఉదయం 7.00గంటలకు ఖాన్ రీసెర్చ్ ల్యాబరేటరీస్(కెఆర్‌ఎల్) ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన శ్వాసకోశాలు దెబ్బతినడంతో ఆయన మరణించారని డాక్టర్లు తెలిపారు. ఆయన ప్రాణాలు కాపడ్డానికి శాయాశక్తుల ప్రయత్నించామని అంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ తెలిపారు.

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ “ డాక్టర్ ఏక్యూ ఖాన్ కన్నుమూయడం తీవ్ర విషాధాన్ని కలిగించింది” అని, పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ట్విట్టర్‌లో “ఆయన కన్నుమూయడం తీవ్ర విషాధాన్ని కలిగించింది. నాకు ఆయన 1982 నుంచి వ్యక్తిగతంగానూ తెలుసు. ఆయన పాకిస్థాన్ అణుపాటవాన్ని పెంపొందించడంలో చాలా తోడ్పడ్డారు. ఆయనకు దేశం యావత్తు రుణపడి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇక పాకిస్థాన్ రక్షణ మంతిమ్ర పర్వేజ్ ఖట్టక్ “ తీవ్ర బాధ కలిగించింది. ఆయన ఇక లేరనేది తీరని లోటు” అని పేర్కొన్నారు.

పాకిస్థాన్ మాజీ మిలిటరీ నిరంకుశ జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ “ ఆయన సేవలు లేకుంటే పాకిస్థాన్ తొలి ముస్లిం న్యూక్లియర్ దేశంగా అవతరించేదే కాదు” అన్నారు.

ఇస్లామాబాద్ హైకోర్టు 2009లో ఆయన పాక్ స్వేచ్ఛాయుత పౌరుడిగా ప్రకటించి, దేశంలో స్వేచ్ఛగా తిరిగే అనుమతిని ఇచ్చింది. పాకిస్థాన్ నుంచి అణు సాంకేతిక విజ్ఞానం ఇరాన్, లిబియా, ఉత్తర కొరియాలకు వ్యాపించడానికి పాక్ అణు కార్యక్రమ పితామహుడు ఏక్యూ ఖాన్‌యే కారణం. పాక్ అణు మౌలికవసతుల వెనుక చైనా, సౌదీ అరేబియా మద్దతు ఉందని ఆయన రాశారు. ఏది ఏమైనప్పటికీ ఆయన అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లోని ఫైసల్ మసీదులో మధ్యాహ్నం 3.00 గంటలకు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News