Tuesday, May 7, 2024

ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ ఇకలేరు!

- Advertisement -
- Advertisement -

Satyajit
బెంగళూరు: కన్నడ సీనియర్ నటుడు,డైరెక్టర్, రచయిత సత్యజిత్ ఆదివారం బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 72 ఏళ్లు. ఆయన చాలా రోజులుగా బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు.

సత్యజిత్ అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్. నటించడం ఆయన అభిరుచి. చిన్నతనం నుంచే ఆయన నటిస్తున్నారు. ఆయన దాదాపు 650కు పైగా కన్నడ సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో ఆయన విలన్ పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన చాలా రోజులుగా చిత్రాల్లో నటించలేకుండా ఉన్నారు. ఆయన నటించిన ప్రసిద్ధ సినిమాలు: పుట్‌నంజ(1995), శివ మెచ్చిద కన్నప్ప(1988), చైత్రద ప్రేమాంజలి(1992), ఆప్తమిత్ర(2004).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News