Home జాతీయ వార్తలు ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)

ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదం: 16మంది మృతి (వీడియో)

train-accident, 14 People Died in Aurangabad Train Accident

మహారాష్ట్ర: ఔరంగాబాద్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. అలసిపోయి కర్మాడ్ వద్ద ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భూసావల్- జాల్నా మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాంలో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కు నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆర్‌పిఎఫ్, స్థానిక పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. రైల్వే ఫోర్స్, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) తెలిపారు.

16 People Died in Aurangabad Train Accident