Tuesday, May 7, 2024

ఒకేసారి 18 ఏనుగులు మృతి

- Advertisement -
- Advertisement -

18 Elephant dead in Assam

భువనేశ్వరి: అస్సాంలోని నగావ్ జిల్లాలో 18 ఏనుగులు మృతి చెందాయి. ఒకే సారి 18 ఏనుగులు చనిపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. బాముని పర్వతాలలో ఏనుగుల మృతి చెందిన స్థలాన్ని అటవీ శాఖ మంత్రి పారిమాల్ సకిల్ బాద్యా పరిశీలించారు. అక్కడకెళ్లి కళేబరాలకు నివాళులర్పించారు. అటవీ శాఖ అధికారులు, వెటర్నరీ వైద్యులు అక్కడి చేరుకొని పరిశీలించారు. పిడుగు పాటు లేక విష ప్రయోగంలో మృతి చెందాయా? అనేది తెలియాల్సి ఉందని వెటర్నరీ వైద్యులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మూడు రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. పూర్తిగా దర్యాప్తు చేయడానికి 15 రోజుల సమయం పడుతోందన్నారు. విష ప్రయోగం చేసి చంపేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఏనుగుల మృతి చెందడం తొలిసారి అని అన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News