Tuesday, May 7, 2024

మీ బాధ నా బాధ కాదా?: మోడీ

- Advertisement -
- Advertisement -

I am feeling it equally said by modi

 

ఢిల్లీ: కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయతాండవంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కనిపించని శత్రువుతో ప్రపంచం పోరాటం చేస్తోందన్నారు. వైరస్ వేగంగా మ్యూటేషన్ చెందడంతో ప్రపంచానికే సవాలు విసిరిందన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడీ మీడియాతో మాట్లాడారు. గత 100 సంవత్సరాలలో లేని కఠిన సమయాన్ని మనం చూస్తూ ఎదుర్కొంటున్నామన్నారు. దగ్గరి వ్యక్తులని కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, మీరు అనుభవిస్తున్న బాధ తనని ఎంతో కలిచి వేసిందని మోడీ విచారం వ్యక్తం చేశారు. భారతీయులకు ప్రధాన సేవకుడిగా ఉన్నానని, ప్రతి ఉద్వేగాన్ని పంచుకుంటానని, కరోనా వైరస్ ప్రపంచాన్ని ప్రతి క్షణం పరీక్షిస్తోందని, మన ముందు కనిపించని శత్రువు ఉందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు వైద్య సదుపాయాలతో పాటు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అనుక్షణం పోరాటం చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 18 కోట్ల మందికి టీకాలు ఇచ్చామని, ఉచిత టీకాలు అందిస్తామని, అందరూ టీకా తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్‌కు రక్షణ కవచంలా ఉండి మనల్ని కాపాడుతుందని, టీకా తీసుకున్న తరువాత కూడా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజుకు నాలుగు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ లేదా పాక్షిక లాక్‌డౌన్ విధించాయి. గ్రామీణ ప్రాంతాలపై కరోనా పంజా విసురుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News