Friday, May 10, 2024

18 ర్యాలీలు… 30 వేల కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
18 Trump Rallies Over 30000 Coronavirus cases
ట్రంప్ ప్రచార లెక్కతీసిన వర్శిటీ

న్యూయార్క్ : ప్రెసిడెంట్ ట్రంప్ పాల్గొన్న 18 ఎన్నికల ర్యాలీలతో దేశంలో దాదాపుగా మరో 30000 మందికి కరోనా సోకిందని వెల్లడైంది. ఈ కరోనా వ్యాప్తి ప్రభావంతో 700 మందికి పైగా చనిపోవడానికి దారితీసిందని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో హెచ్చరించారు. ఇటీవలి కాలంలో ట్రంప్ జరిపిన ఎన్నికల ప్రచార సభలు ఆయా ప్రాంతాలలో తలెత్తిన కరోనా కేసుల గురించి అధ్యయనం జరిగింది. కరోనా కట్టుబాట్ల గురించి పట్టించుకోకుండా ట్రంప్ సభలు పలు ప్రాంతాలలో జరిగినట్లు విమర్శలు తలెత్తాయి. ట్రంప్ ర్యాలీలతో ఎన్నికలు ఫలితాల సంగతి ఏ విధంగా ఉన్నా కరోనా వ్యాప్తి , సంబంధిత మరణాలు ఎక్కువ అయ్యాయని, ఈ విధంగా ఈ సభలతో ప్రజలు మూల్యం చెల్లించుకోవల్సి వచ్చిందని పరిశోధకులు అసాధారణ రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా దశలో భారీ జనం చేరడం, సభలు నిర్వహించడం ప్రత్యేకించి ట్రంప్ ర్యాలీల అంశంపైనే పరిశోధకులు దృష్టి సారించారు. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ మధ్యకాలంలో ట్రంప్ 18 సభలలో పాల్గొన్నారు. తరువాతి క్రమంలో ఆయా ప్రాంతాల్లో కలిపి మొత్తం మీద మరో 30వేల మందికి వైరస్ పట్టుకుంది. దీనితో 700 మందికి పైగా చనిపొయ్యారని తెలిపారు. సభలలో నేరుగా పాల్గొనకపోయిన వారు కూడా ఇక్కడి సభలకు వచ్చిన వారి ద్వారా వైరస్ ప్రభావానికి గురి అయిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ అధ్యయనంపై బిడెన్ స్పందించారు. ఆయన ప్రజల పట్ల కనీసం జాలి చూపడం జరగదు. కనీసం సొంత మద్దతుదార్ల చావుబతుకుల గురించి అయినా పట్టించుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు. మాస్క్‌లు పెట్టుకోకుండా, మాస్క్‌లు వేసుకునే వారిని ఈసడించుకుంటూ ఉండే ట్రంప్ సభలలో ప్రదర్శితమైన నిర్లక్ష ప్రభావం గురించి శుక్రవారం అధ్యయన వివరాలు వెలువడ్డాయి.

దేశంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉందని 8 కోట్ల 70 లక్షల మందికి పైగా అమెరికన్లకు కోవిడ్ సోకిందని, ఇప్పటికీ 2,25,000 మంది చనిపొయ్యారని అధికారిక లెక్కలే వివరిస్తున్నాయని ఈ అధ్యయనంలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నియంత్రణ కేంద్రాలు పలు సార్లు భారీ స్థాయి జనం గుమికూడే సభల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. సరైనభౌతిక దూరాలు, మాస్క్‌లతో ఉండాలని సూచించారు. ప్రామాణిక గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ర్యాలీలు జరిగాయా? లేదా అనేది ముఖ్యమైన విషయం అని, అయితే తమ అధ్యయనం మేరకు 18 ర్యాలీలు , 30వేల కరోనా కేసుల లెక్కతేలిందని దీనికి ఎవరు జవాబుదారి అని ప్రశ్నించారు.

18 Trump Rallies Over 30000 Coronavirus cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News