Monday, April 29, 2024

2,00,000 సర్కారీ కొలువులు

- Advertisement -
- Advertisement -

ఏడాదిలోగా భర్తీ.. వెంటనే 15వేల పోలీస్ పోస్టుల్లో నియామకాలు

నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం

కోర్టు అడ్డంకులను తొలగించి స్టాఫ్ నర్స్ టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన
చేశాం.. త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం ఫాంహౌస్‌లో ఉన్నోళ్లు కుళ్లుకున్నా
నియామక ఉద్యోగాల భర్తీ ఆగదు స్టాఫ్ నర్సులకు ఎల్‌బి స్టేడియంలో
నియామకపత్రాలు అందజేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: నిరుద్యోగుల ఆకాంక్షలను నిజం చేసేందుకు కాంగ్రెస్ సర్కా ర్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారి కళ్లల్లో వెలుగు చూడటమే తమ లక్ష్యమని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంవత్సరంలోపు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చే స్తామని స్పష్టం చేశారు. 15వేల పోలీసు ఉద్యోగాల ను భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మ ల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సిఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కోర్టు అడ్డంకులను తొలగించి 7,094 మందికి సర్కారీ నౌకర్లు కల్పించామని వివరించారు.

విద్యార్థుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో పదేళ్లుగా గత ప్రభుత్వం యువత ఆకాంక్షలు నె రవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన యువతపై గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టి వేధించిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేవలం సిఎం పరివారం గురించి మాత్ర మే ఆలోచిస్తోందని ఆక్షేపించారు. ఆరోగ్య తెలంగాణను నిర్మించడంలో నర్సులదే కీలకపాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తుచేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం నిరుద్యో గులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని, పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూడాలనే లక్షంతోనే వారికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. కెసిఆర్ తన కుమార్తె కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే ఆమెకు ఎంఎల్‌సి పదవి ఇచ్చి ఉపాధి కల్పించారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారి ఉద్యోగాల గురించి కెసిఆర్ ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. టిఎస్‌పిఎస్‌సిని ఇప్పటికే ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా కొత్త ఛైర్మన్, సభ్యులను నియమించామన్నారు. ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఎం రేవంత్ పునరుద్ఘాటించారు.

మీ అల్లుడ్ని పిలిచి గడ్డిపెట్టండి
‘పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదు. తమ కుటుంబసభ్యులకు పదవుల గురించి తప్ప వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదు. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే మా ప్రభుత్వంపై హరీశ్ శాపనార్థాలు పెడుతుండు. ‘హరీశ్‌రావు గారు.. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదు. అవాకులు చెవాకులు పలకడం కాదు… ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండి. కెసిఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. మా ప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది’ అని వెల్లడించారు.

త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతాం..
ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా. ‘నిరుద్యోగులకు ఇచ్చి న మాటకు మేం కట్టుబడి ఉన్నాం. ఏడాదిలోగా 2లక్షల ప్రభు త్వఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. మీ కళ్ళల్లో ఆనందం చూసి.. ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుళ్లుకున్నా.. కడుపులో దుఃఖం పొం గుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదు” అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు కల్పించే బాధ్యతను రాష్ట్రప్రభుత్వం తీసుకుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

పదేళ్లలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్న భట్టి, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కొత్త నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖలో మరో 5 వేల ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానాన్ని పక్కాగా అమలుచేయడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో సిం హ భాగం దక్కాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పారదర్శకంగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నా రు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు రాష్ట్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వ చొరవను కొనియాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News