Friday, April 26, 2024

ఐరోపాలో వారం రోజుల్లో 20 లక్షల కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

20 lakh Covid cases on weekdays in Europe

 

జెనీవా : గత వారం రోజుల వ్యవధిలో ఐరోపా వ్యాప్తంగా దాదాపు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని మహమ్మారి మొదలైన దగ్గర నుంచి ఒకే వారంలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే వ్యవధిలో దాదాపు 27 వేల మరణాలు సంభవించినట్టు తెలియచేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని మరణాలను లెక్కిస్తే సగానికి పైగా ఇక్కడే నమోదైనట్టు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో వ్యాక్సినేషన్ రేటు అధికంగా ఉన్న ఫ్రాన్స్, బెల్జియం, తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని డబ్లుహెచ్‌వొ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం టీకాల తోనే కొవిడ్ కట్టడి సాధ్యం కాదని, భారీగా పరీక్షలు నిర్వహించడం, మాస్కుల వినియోగం, వ్యక్తిగత దూరం, వెంటిలేషన్ చక్కగా ఉండేలా చర్యలు కొనసాగించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News