Saturday, May 4, 2024

పండగలకు 39 ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

39 special trains in different zones

 

వేర్వేరు జోన్లకు టైమ్ టేబుల్
ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లను భారతీయ రైల్వే నడపనుంది. దసరా, దీపావళి సందర్భంగా ఈ రైళ్లు నడవనున్నాయి. కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల మీదుగా వెళ్లనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నడిచే ప్రత్యేక రైళ్ల వివరాలు, రూట్స్, టైమింగ్స్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ రైల్వే దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేర్వేరు జోన్లలో 39 స్పెషల్ ట్రైన్స్ నడపుతోంది. వీటిలో ఎసి ఎక్స్‌ప్రెస్, దురంతో, రాజధాని, శతాబ్ధి లాంటి రైళ్లు ఉన్నాయి.

ఆ రైళ్ల జాబితా, రూట్లు, టైమింగ్స్ వివరాలు ఇలా..

పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 39 రైళ్ల జాబితాను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. అందులో భాగంగా దసరా, దీపావళి సందర్భంగా భారతీయ రైల్వే నడిపే 39 ప్రత్యేక రైళ్లలో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే రైళ్లు ఉన్నాయి. ఆ రైళ్ల జాబితా, రూట్లు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు

రైలు నెంబర్ 02774 సికింద్రాబాద్ నుంచి షాలిమార్‌కు ప్రతి మంగళవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 13 నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. ఈ రైలు వరంగల్, రాయనపాడు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

రైలు నెంబర్ 02773 షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు

రైలు నెంబర్ 02773 షాలిమార్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి బుధవారం రైలు బయల్దేరుతుంది. అక్టోబర్ 14 నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 4.05 గంటలకు షాలిమార్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, రాయనపాడు, వరంగల్ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

02708 వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో…

రైలు నెంబర్ 02708 తిరుపతి నుంచి విశాఖపట్నం వారంలో మూడు రోజులు రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 14 నుంచి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూ గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

02707 విశాఖపట్నం నుంచి తిరుపతికి వారంలో మూడు రోజులు

రైలు నెంబర్ 02707 విశాఖపట్నం నుంచి తిరుపతికి వారంలో మూడు రోజులు రైలు నడుస్తుంది. అక్టోబర్ 15 నుంచి ప్రతి గురువారం, శనివారం, సోమవారం రాత్రి 10.25 గంటలకు విశాఖపట్నంలో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

02784 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రతి వారం ప్రత్యేక రైలు

రైలు నెంబర్ 02784 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రతి వారం ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబర్ 17 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దారిలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వేస్టేషన్లలో రైలు ఆగుతుంది.

02783 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు

రైలు నెంబర్ 02783 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి వారం ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6.55 గంటలకు రైలు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

02775 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు

రైలు నెంబర్ 02775 కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 25 నుంచి ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

02776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు వారంలో మూడు రోజులు

రైలు నెంబర్ 02776 లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు వారంలో మూడు రోజులు ప్రయాణిస్తుంది. 2020 అక్టోబర్ 26 నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7.55 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రైలు దారిలో బేగంపేట్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి స్టేషన్లలో ఆగుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News