Friday, May 3, 2024

కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ విశ్వనగరం

- Advertisement -
- Advertisement -

Hyderabad development under leadership of CM KCR

 

 ‘గ్రేటర్’ చట్టానికి 5 సవరణలు 79 డివిజన్‌లలో
మహిళలను గెలిపించిన ఘనత టిఆర్‌ఎస్‌దే
వార్డు కమిటీల్లో రాజకీయాలకు అతీతంగా చోటు
యథాతథంగా బిసిల రిజర్వేషన్ పర్యావరణం, ఫార్మా
ఇండస్ట్రీపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం హాస్యాస్పదం
హరితనగరం పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి
జిహెచ్‌ఎంసి సవరణ బిల్లులు ప్రవేశపెడుతూ
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సిఎం కెసిఆర్ నేతృత్వ ంలో మహానగరంగా, విశ్వనగరంగా ఎదడగానికి శరవేగంగా అభివృద్ధిలో దూ సుకుపోతుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శాసనసభలో జిహెచ్‌ఎంసి సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మం త్రి కెటిఆర్ మాట్లాడుతూ గ్రే టర్ హై దరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ, 10 శాతం బడ్జెట్‌ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండో చట్ట సవరణ, అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెం చుతూ మూడో చట్ట సవరణ, జిహెచ్‌ఎంసి రిజర్వేషన్ రెండు పర్యాయా లు కొనసాగిస్తూ నాల్గొవ చట్ట సవరణ, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేలా ఐదో చట్ట సవరణ చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు.

నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడిందన్నారు. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్‌ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937లో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీగా, 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడిందన్నారు. 1948 నుంచి 1956 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వా రికి ఎన్నడూ రాలేదన్నారు. అందులో భాగంగా ఇవాళ టిఆర్‌ఎస్ ప్రభు త్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటుందన్నారు.

79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టిఆర్‌ఎస్‌దే

2015లో ఒక జిఓ ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నామన్నారు. 150 డివిజన్లలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పట్లోనే నిర్ణయించామన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలన్న ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఈరోజు చట్టం చేసుకుంటున్నామన్నారు. గతంలో 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన చరిత్ర టిఆర్‌ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. మహిళా సాధికారిత విషయంలో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా…

తెలంగాణలో 5 నుంచి 6 శాతం గ్రీన్‌కవర్ పెరిగిందని కేంద్రం ఓ నివేదికలో పేర్కొందని మంత్రి కెటిఆర్ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో హరితహారం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. పంచాయతీరాజ్, ము న్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్‌కవర్‌కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బ్రతకాలన్న ఉద్ధేశ్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆ బాధ్యతలు అప్పచెప్పామన్నారు. పంచాయతీరాజ్, పురపాలక చ ట్టం మాదిరిగానే జిహెచ్‌ఎంసి చట్ట సవరణలో మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు.

వార్డు కమిటీల నియామకం

జిహెచ్‌ఎంసి చట్ట సవరణలో భాగంగా వార్డు కమిటీలను నియమిస్తున్నట్టు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో పెంచేందుకు ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నామన్నారు. జిహెచ్‌ఎంసీ పరిధిలో 15 వేల మందితో కమిటీలు వేస్తామని, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వార్డు కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. ఇందులో యూత్ కమిటీ, మహిళా కమిటీ, సీనియర్ సిటిజన్, ఎమినెంట్ సిటిజన్ అనే నాలుగు రకాల కమిటీలను తీసుకురాబోతున్నామని మంత్రి తెలిపారు. ఈ కమిటీల్లో 50 శాతం మహిళలు ఉండేలా చర్యలు తీసుకుంటా మన్నారు.

రెండు టర్మ్‌లకు కలిపి ఒకేసారి…

ప్రతిసారి రిజర్వేషన్లను మార్చడం వలన ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం లేకుండా పోతుందన్నారు. రెండు టర్మ్‌లకు ఒకే రిజర్వేషన్ ఉండే లా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో మార్పులు తీసుకొచ్చామన్నారు. అదే పాలసీని జిహెచ్‌ఎంసి యాక్ట్‌లో చేర్చబోతున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. 2015 ఒకసారి ఎన్నికలు జరగ్గా, ప్రస్తుతం ఇప్పుడు మరోసారి జరుగుతున్నందున రెండు టర్మ్‌లకు కలిపి ఒకేసారి రిజర్వేషన్‌లు ఉండేలా చట్ట సవరణ చేస్తున్నామన్నారు. జనగణన 10 సంవత్సరాల ఒకసారి చేపట్టినట్టే రిజర్వేషన్లను కూడా 10 సంవత్సరాలకు ఒకసారి చేపట్టేలా సవరణలు చేశామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఎన్నికలు

రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తీసుకొని ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఈ మేరకు చట్ట సవరణ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇం దులో లా అండ్ ఆర్డర్ తదితర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పలువురి సూచనలను తీసుకున్నామని, వాటిని పరిగణలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించేలా చట్ట సవరణ చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

వార్డు కమిటీల పెంపుపై ఆలోచిస్తాం

చర్చలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వార్డుకమిటీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకెళుతుందన్నారు. వార్డు కమిటీలు పెంచాలని సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు దానిపై మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ కేసు హైకోర్టులో పెండింగ్

బిఆర్‌ఎస్‌కు సంబంధించి చాలా దరఖాస్తులు వచ్చాయని, దానికి సంబంధించి అధికారులు షార్ట్‌ఫాల్స్‌ను కూడా పంపించారన్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు ఉందని దీనిపై విచారణ కొనసాగుతోందని, దీనిపై ఉన్న స్టేను త్వరలోనే వెకెట్ చేయించడానికి అధికారులు కృషి చేస్తున్నారని, అధికారులు న్యాయశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారన్నారు.

యధాతధంగా బిసిల రిజర్వేషన్

యధాతధంగా బిసిల రిజర్వేషన్ కొనసాగుతోందని, బిసిల విషయంలో 33.3 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ గతంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం 83 మంది బడుగు, బలహీన వర్గాల సోదరులను గెలిపించుకున్నామన్నారు. పాత జిహెచ్‌ఎంసి యాక్ట్‌ను యధావిధిగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ స్థిరాస్థుల విషయంలో చిక్కులు, ఇబ్బందులను తొలగించి వారికి యాజమాన్య హక్కు కల్పించాలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్ ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News