Wednesday, May 15, 2024

రాష్ట్రానికి రూ.409.5 కోట్ల నిధులు

- Advertisement -
- Advertisement -

గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేసిన కేంద్రం

409.5 crores released to Telangana

మన తెలంగాణ/హైదరాబాగద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.409.5 కోట్లను విడుదల చేసింది. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2021..2022)లో టైడ్ గ్రాంట్ల రూపంలో మొదట విడత కింద మంజూరు చేస్తున్నట్లు మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఈ సంవత్సరంలో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.682.5 కోట్లు విడుదలయ్యాయి. గ్రామీణ స్థానిక సంస్థలకు రెండు క్లిష్టమైన సేవలను మెరుగుపరచడం కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా పారిశుద్ధం, బహిరంగ మల విసర్జన రహిత స్థితి, తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ,నీటి రీసైక్లింగ్ వంటి అంశాలను అద్భుతంగా నిర్వహించే రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోంది.

ఇందులో పంచాయితీ రాజ్ సంస్థలకు కేటాయించిన మొత్తం గ్రాంట్-..ఇన్..-ఎయిడ్‌లో 60 శాతం ’టైడ్ గ్రాంట్’ నిధులుగా పేర్కొన్నది. ఈ నిధులను తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ, పారిశుధ్యం వంటి జాతీయ ప్రాధాన్యతల కోసం వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన 40 శాతం ’అన్‌టైడ్ గ్రాంట్’ నిధులను జీతాల చెల్లింపు మినహా, పంచాయితీ రాజ్ సంస్థల అభీష్టానుసారం, నిర్దిష్ట అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పారిశుద్ధం, తాగునీటి కోసం కేంద్రం, రాష్ట్రం కేటాయించిన నిధుల కంటే గ్రామీణ స్థానిక సంస్థలకు అదనపు నిధుల లభ్యతను నిర్ధారించడానికి టైడ్ గ్రాంట్లు ను వెచ్చించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News