Wednesday, May 15, 2024

48 కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

covid-19

 

మరో ముగ్గురు కరోనా రోగులు మృతి
చికిత్స పొందుతున్న 651 మంది
మొత్తం పాజిటివ్‌లు 858

ప్రతి 10లక్షల మందిలో
375 మందికి కరోనా పరీక్షలు
కేసులు డబుల్ అయ్యేందుకు
10 రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో రికవరీ ఎక్కువ మరణాలు తక్కువ
వనపర్తి, వరంగల్ రూరల్, సిద్ధిపేట, యాదాద్రిభువనగిరిలో సున్నా కేసులు

కేసులు డబుల్ అయ్యేందుకు పది రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయి కంటే రికవరీ ఎక్కువ.. మరణాలు తక్కువ
రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ 22%, డెత్ రేట్ 2.44%
నాలుగు జిల్లాల్లో సున్న కేసులు… చికిత్స పొందుతున్నవారు మే 4 వరకు డిశ్చార్జ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 10 లక్షల మందికి సగటున 375 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదే జాతీయ స్థాయిలో 254 మందికి టెస్టులు చేస్తున్నారు. అలాగే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 రోజులకు డబుల్ అవుతోంది. జాతీయ స్థాయిలో ఎనిమిది రోజులుగా ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కొవిడ్ 19పై మీడియాకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఇందులో కరోనా వైరస్ వ్యాప్తి, బాధితులకు చికిత్స, ప్రభుత్వ సన్నద్ధత వివరాలు ఇచ్చారు. దీని ప్రకారం జాతీయ స్థాయితో చూస్తే రాష్ట్రంలో రికవరీ రేటు అధికంగా ఉంది. దేశవ్యాప్తంగా 14 శాతం ఉండగా తెలంగాణలో 22 శాతంగా ఉంది. అలాగే కొవిడ్ 19తో చనిపోతున్న వారిలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలో తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 3.22 శాతం ఉంటే రాష్ట్రంలో 2.44 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 858 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 186 మందిని డిశ్ఛార్జ్ చేశారు. 21 మంది చనిపోయారు.

ఆదివారం కొత్తగా 49 కేసులు నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. 651 మంది చికిత్స పొందుతున్నారు. వీరంతా సోమవారం నుంచి మే 4వ తేదీ వరకు కోలుకుని డిశ్ఛార్ అవుతారని ప్రభుత్వం తెలిపింది. నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు సున్నగా ఉన్నాయి. ఇందులో వరంగల్ రూరల్, యదాద్రి భువనగిరి, వనపర్తి, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి. ఈ నెల 18వ తేదీ వరకు జిల్లాల్లో 122 క్వారంటైన్‌లు ఉండగా, జిహెచ్‌ఎంసిలో ఐదుతో కలిపి మొత్తం 127 ఏర్పాటు చేసింది. వీటన్నింటిలో 1818 మంది అనుమానితులు ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 292 కంటైన్మెంట్ జోన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఆరు జోన్‌లలో 151, ఇతర మున్సిపాలిటీల్లో 87 కంటైన్మెంట్ జోన్‌లు, ఇతర రూరల్ ఏరియాల్లో 54 కంటైన్మెంట్లు ఏర్పాటు చేశారు. మే 3 వరకు వీటి కంటైన్మెంట్ పూర్తవుతోంది.

లాక్‌డౌన్‌లోనూ అత్యవసర సేవలు
లాక్‌డౌన్‌లోనూ అత్యసవర సేవలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. లాక్‌డౌన్ పీరియడ్‌లో 29,991 డెలివరీలు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇమ్యునైజేషన్ 94.4 శాతం ఉంది. 580 తలేసిమియా, 5050 డయాలాసిస్ రోగులకు సేవలు అందించారు. 1507 మందికి కీమోథెరపి అందించారు.

ఐసోలేషన్ బెడ్స్ ఇలా
కరోనా బాధితులు, అనుమానితులకు చికిత్స నిమిత్తం ప్రభుత్వం ముందస్తుగా ఐసోలేషన్ బెడ్‌లను సిద్ధం చేసింది. మొత్తం 12,400 ఐసోలేషన్ బెడ్స్(ఐసియూ కలుపుకుని) ఏర్పాటు చేయగా ఇందులో 564 వెంటిలేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐసియూ బెడ్స్ 1400 ఉన్నాయి. ఇందులో మూడు ఫేజ్‌లు ఉన్నాయి. ఒకటో ఫేజ్‌లో 4600, రెండో ఫేజ్‌లో 4500, మూడో ఫేజ్‌లో 3300 బెడ్స్ సిద్ధం చేశారు.

ల్యాబ్‌లు.. టెస్టులు
రాష్ట్రంలో ఉన్న ల్యాబ్‌లు 09
రోజుకు టెస్టింగ్ కెపాసిటి 1560
ఇప్పటివరకు సేకరించిన శాంపిల్స్ 14,962
పాజిటివ్ వచ్చినవి 858
నెగిటివ్ రిపోర్ట్ వచ్చినవి 14,104
పరీక్షలు కొనసాగుతున్నవి 768
పిపిఇ కిట్స్ 3.04 లక్షలు
ఎన్ 95 మాస్కులు 3.53 లక్షలు
3 ప్లై మాస్కులు 36.50 లక్షలు
శాంపిల్ సేకరించే కిట్స్ 61,119
టెస్టింగ్ కిట్స్ 21,366
హెచ్‌సిక్యూ 12.35 లక్షలు
వైద్య సిబ్బంది 50,807
అజిత్రోమెసిన్ 250 ఎం.జి 19.09 లక్షలు
అజిత్రోమెసిన్ 500 ఎం.జి 28.98 లక్షలు

 

48 new Corona cases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News