Friday, May 10, 2024

తృటిలో ఐదు ప్రాణాలు బలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద కారు, టిప్పర్ ఢీ
కారులోని ఐదుగురు యువకులు దుర్మరణం 
నలుగురు అక్కడికక్కడే, ఒకరు ఆసుపత్రిలో మృతి
వేకువ  జామున ప్రాణాలు తీసిన అతివేగం

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతిచెందారు. గచ్చిబౌలి, విప్రో సర్కిల్ వద్ద కారు, టిప్పర్ లా రీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కా రులోని నలుగురు యువకులు అక్కడిక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మరణించారు. విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసి వెళ్లిన కారును టిప్పర్ ఢీకొన్నది. కారు లారీ పట్టీకొట్టాయి. కారు నుజ్జును జ్జు అయ్యింది. అందులోని యువకుల శరీర భాగాలు చెల్లచెదురయ్యాయి. నలుగురు మరణించగా కొన ఊపిరితో ఉన్న ఐదో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ అతడు మరణిచారు.

పోలీసులు కథనం ప్రకారం.. ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, సంగాయిగూడెం గ్రామానికి చెందిన కాట్రగడ్డ సంతోష్(25) నగరంలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న మారుతీమెన్స్ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపిలోని నెల్లూరు జిల్లా, ఆంధ్ర కేసరీనగర్, వేదాయపాలెం, త్యాగరాజనగర్‌కు చెందిన కొల్లురు పవన్(24) అయ్యప్పసొసైటీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా, సకినేటిపల్లికి చెందిన చింత మనోహర్(23) నగరంలో యానిమేషన్ ఉద్యోగం చేస్తున్నాడు. ఎపిలోని విజయవాడకు చెందిన పప్పు భరద్వాజ్(20) నగరంలో ఉంటున్నాడు. ఎపిలోని నెల్లూరుకు చెందిన నాగిశెట్టి రోషన్ నగరంలో ఉంటు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఐదుగురు యువకులు అయ్యప్పసొసైటీలోని మారుతి మెన్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఐదుగురు యువకులు ఆదివారం మారుతి స్విఫ్ట్ కారులో విందులో పాల్గొనేందుకు బయటికి వెళ్లారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డివైపు బయల్దేరారు. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

5 dead after Car rams into Tipper at Gachibowli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News