Tuesday, April 30, 2024

పాలకుర్తిలో 50 పడకల దవాఖాన

- Advertisement -
- Advertisement -

జిఓ జారీ చేసిన ప్రభుత్వం
ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మన తెలంగాణ / హైదరాబాద్: పాలకుర్తి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన పాలకుర్తి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌ను 50 పడకల దవాఖానను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు పోయిన నెల సెప్టెంబర్ 4 న పాలకుర్తి పర్యటనలో మంత్రి హరీశ్ రావు ఇచ్చిన హామీని ఈరోజు నిజం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ జీవో జారీ చేసింది.

రూ. 17 కోట్ల 50 లక్షలకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా పాలకుర్తి ప్రజల కలను నెరవేర్చిన సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులకు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జీవో జారీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News