Tuesday, April 30, 2024

ప్రయాణికులకు మెట్రో మరో బంఫర్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

50% cashback on Metro Smart Recharges

నేటి అమలులోకి వస్తుందని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు నూతన ఆఫర్లు తీసుకొస్తూ ప్రయాణికుల సంఖ్య పెంచేకునే పనిలో పడింది. ఈనెల 16న ప్రకటించిన సువర్ణ ఆఫర్‌కు నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో మరో ఆఫరు తీసుకొచ్చి తమ మైలురాయిని చేరుకునేందుకు మెట్రో అధికారులు ప్రయత్నాలు పెంచారు. అందులో భాగంగా శనివారం మెట్రో ప్రయాణికులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెట్రో స్మార్ట్ రీచార్జ్‌పై 50శాతం వరకు క్యాష్ బ్యాక్ వచ్చే ఆఫర్ తీసుకొస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రోస్టేషన్లు, ఆన్‌లైన్‌లో రీచార్జీ చేసుకునే వారికి ఈఆఫర్ వర్తిస్తుందన్నారు. ప్రయాణికులకు వచ్చే క్యాష్ బ్యాక్ కూడా స్మార్ట్ కార్డులోనే జమ కానుందని పేర్కొన్నారు.

అయితే రీచార్జీ చేసుకున్న మొత్తాన్ని 90 రోజుల్లో వినియోగించాలని సూచించారు. రీచార్జీపై రూ.1500 ప్రయాణికుడు, రూ.600 స్మార్ట్‌కార్డులో క్యాష్‌బ్యాక్‌గా, జోడించి మొత్తం రూ.2100 అదనంతో పాటు ప్రతి ప్రయాణంలో 10 శాతం తగ్గింపు పొందే అవకాశం కల్పించారు. అదే విధంగా మూడు కారిడార్ల పరిధిలో రోజుకు 1.30లక్షల మందికి వెళ్లుతున్నాట్లు,40 శాతం రాయితీతో ప్రకటించిన సువర్ణ ప్యాకేజీతో ప్రయాణికుల సంఖ్య 30శాతం పెరిగినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చినప్పడు నుంచి కొంత ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, ఆఫర్లతో ఇంకా మెరుగుపడిందని, నవంబర్‌ను తరువాత సాప్ట్‌వేర్ ఉద్యోగులు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తే మెట్రోకు పూర్వవైభవం వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు,ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతి ఇస్తున్నామని,మహమ్మారి సోకుతుందనే భయం అవసరంలేదని వెల్లడిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News