Sunday, April 28, 2024

కీరవాణి స్వరపరచిన పాటను ఆవిష్కరించిన డిజిపి

- Advertisement -
- Advertisement -

DGP who unveiled song composed by Keeravani

 

మనతెలంగాణ/హైదరాబాద్ : గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్ అనే పాటను డిజిపి ఎం. మహేందర్ రెడ్డి శనివారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.. ఈనెల 21 వతేదీ నుండి నేడు 31 వ తేదీ వరకు నిర్వహించిన పోలీస్ ఫ్లాడ్ డే కార్యక్రమాల సందర్బంగా ఈ పాటను ఆవిష్కరించడం సందర్బోచితంగా ఉందన్నారు. విధినిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే కష్ట్టాలు,సేవలను స్ఫూర్తి దాయకంగా పొందుపర్చారని గేయ రచయిత అనంత శ్రీరాంను డిజిపి ప్రశంసించారు. మనం కష్టపడుతూ సేలందిస్తుంటే మనతో ఎంతోమంది కలసి వస్తారని ఈ పాటలో నిగూడ అర్థం దాగింవుందని డీజీపీ అన్నారు. అనంతరం సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. మాతృ దేవోభవ, పితృ, ఆచార్య దేవోభవ అన్న మాదిరిగానే రక్షక దేవోభవ అనే రోజులు వస్తాయని, ఈ దిశగా పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

తన తొమ్మిదేళ్ల వయస్సులో తోలి కార్యక్రమం రాయచూరులో పోలీస్ సంస్మరణ దినోత్సవం రోజునే ఇచ్చానని తెలియచేసారు. ఇస్తున్నా ప్రాణం మీ కోసం అనే పోలీసు త్యాగాలను తెలియచేసే పాటను 1998 సంవత్సరంలోనే అప్పటి డిజిపి రాములు కోరిక మేరకు స్వర పరచి పాడానని గుర్తు చేశారు. ఈ పాటను హిందీ భాషలో కూడా రూపొందిస్తానని కీరవాణి అన్నారు. ఈ సందర్బంగా అనంత శ్రీరాం రాసిన ఈ పాట చాలా శ్రావ్యంగానూ, స్ఫూర్తి దాయకంగా ఉందని పోలీసు అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పోలీస్ అధికారులు ఉమేష్ ష్రాఫ్, జితేందర్, సందీప్ శాండిల్య, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల నాగాదేవి, వెంకటేశ్వర్లు, ఈ పాట ఎడిటర్ హైమా రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఘనంగా వాల్మీకి జయంతి

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలతోపాటు, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్బంగా రాష్ట్రీయ ఐక్యతా దివస్ లను డిజిపి కార్యాలయం లో శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. డిజిపి కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డిజిపితో పాటు సీనియర్ పోలీసు అధికారులు,కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయి పటేల్ జన్మ దినోత్సవం సందర్బంగా డిజిపి జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞను చేయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News