Wednesday, May 15, 2024

బోల్తాపడిన ట్రక్కు: 53 మంది మృతి

- Advertisement -
- Advertisement -

53 Dead in Truck roll over in Mexico

మెక్సికో: మెక్సికోలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడడంతో పాటు పాదచారుల వంతెనను ఢీకొట్టడంతో 53 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో 58 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మెక్సికో అధ్యక్షుడు అండ్రస్ మన్యూవల్ లోపేజ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. ఒక్కో ట్రక్కులో దాదాపు 100 నుంచి 600 మంది వలసదారులు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News