Sunday, May 5, 2024

రష్యా నుంచి 56.6 టన్నుల స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: స్పుత్నిక్ వి (రష్యాలో తయారైన) వ్యాక్సిన్లను జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌కార్గో (జిహెచ్‌ఏసి)కు తీసుకొచ్చాయి. ఉదయం 03.43 గంటలకు ఈ వ్యాక్సిన్ రష్యా నుంచి ప్రత్యేక చార్టర్ ప్లైట్ ఆర్‌యు 9450 ద్వారా ఈ వ్యాక్సిన్లు హైదరాబాద్ చేరుకున్నాయి. దీనికి ముందు జిహెచ్‌ఎసి ఇప్పటికే అనేక వ్యాక్సిన్లను దిగుమతి చేసింది. ఇప్పటివరకు భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్‌లలో ఈ 56.6 టన్నులే అతిపెద్ద దిగుమతి అని అధికారులు పేర్కొన్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. దీనిని మైనస్ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్లు సజావుగా దిగుమతి చేసుకోవడానికి ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ ప్రక్రియలు పూర్తిగా ఉన్నాయని నిర్ధారించడానికి జిహెచ్‌ఏసి చాలా రోజులుగా సప్లయ్ చెయిన్ టీమ్, కస్టమ్స్ విభాగం అధికారులు, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది.
తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న జిహెచ్‌ఏసి
పెద్ద వ్యాక్సిన్‌ల దిగుమతితో భారతదేశంలో అతిపెద్ద వ్యా క్సిన్ దిగుమతి కేంద్రంగా జిహెచ్‌ఏసి తన స్థానాన్ని మ రింత సుస్థిరం చేసింది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలయన్ డోసుల వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటున్నాయని భావిస్తున్నారు. అందువల్ల వ్యాక్సిన్లను సజావుగా నిర్వహించేందు కు జిహెచ్‌ఏసి అన్ని వనరులను సమకూర్చుకుంటోంది.

56.6 tons of Sputnik V vaccine Reaches hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News