Friday, April 26, 2024

తెలంగాణకు 7 కొత్త జాతీయ రహదారులు..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతో పాటు రహదారుల నిర్మాణంలో భూసేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ గురువారం పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్రనకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2020 జూన్ 29న 90 కి.మీల మేరకు ఖమ్మం-దేవరపల్లి రహదారి పనులను ప్రకటించినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. 20-20 జూన్ 85.55 కి.మీల మేరకు కల్వకుర్తి-కొల్లాపూర్ కరివేన, 2021 మార్చి 23న 97 కి.మీల మేరకు మెదక్ ఎల్లారెడ్డి-రుద్రూర్, 56.40 కి.మీల మేరకు బోధన్ బాసరభైంసా రహదారులను ప్రకటించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2021 ఏప్రిల్ 7న 234 కి.మీల మేరకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వలిగొండ తొర్రూర్‌, మహబూబాబాద్‌, ఇల్లెందు, కొత్తగూడెం.. అదేరోజు 96 కి.మీల మేరకు తాండూర్- కొడంగల్- మహబూబ్‌నగర్ రహదారి నిర్మాణ పనులు మంజూరైనట్లు గడ్కరీ వివరించారు.

  7 New National highways sanctioned to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News