Tuesday, May 21, 2024

రాష్ట్రంలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

7 new omicron cases registered in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. రిస్క్ దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో తాజాగా ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.

గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 165 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా,నలుగుగు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఎట్ రిస్క్ దేశాల ఇప్పటి వరకు 11,921 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News