Saturday, May 4, 2024

అమాంతం జంప్

- Advertisement -
- Advertisement -

Corona cases

 

దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37

ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్
తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. గత 24 గంటల్లో దేశంలో దేశంలో కొత్తగా 896 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరో నా కేసుల సంఖ్య 6761కి చేరుకుంది. వీరి లో 516 మంది కోలుకోగా 206 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో దేశంలో 37 మరణాలు సంభవించాయని శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖసంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

మరో రెండు రోజలు పాటు కేసుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా కేసు వెలుగు చూసిన తర్వాత ఒక్క రోజులో ఇన్ని కొత్త కేసులుకానీ, మరణాలు కానీ నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా మహారాష్ట్రలో 1364 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. అక్కడ 125 మంది కోలుకోగా, 97 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే రాష్ట్రంలో 25 మంది మృతి చెందారు.

ఒక్క ముంబయి నగరంలోనే ఒక్క రోజులోనే 218 పాజిటివ్ కేసు లు నమోదు కాగా పదిమంది చనిపోయినట్లు బృహన్ముంబయి కార్పొరేషన్ ప్రకటించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ముంబయి నగరంలో కేసుల సంఖ్య 993 కు చేరుకోగా మృతుల సంఖ్య 64కు చేరుకుంది. అలాగే తమిళనాడులోను వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో ఒక్క రో జే 90కి పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు సంఖ్య 900 దాటింది. వీరిలో 21 మంది కోలుకోగా, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీ సైతం కరోనా ధాటికి విలవిలలాడుతోంది. నగరంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 898 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13 మంది మరణించారు. కాగా దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో కరోనా వైరస్ కేసులుఅదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది.

ఇక్కడ ఇప్పటివరకు 357 కేసులు నమోదు కాగా, 97 మంది కోలుకున్నారు. ఇద్దరు మాత్రమే మృతి చెందారు. అయితే పిటిఐ లెక్కల ప్రకకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య కనీసం 6,640గా ఉండగా, మరణాల సంఖ్య 227గా ఉంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 14.3 లక్షల మందికి ఆవాసం కల్పించామని,37,978 శిబిరాల్లో వారంతా ఆశ్రయం పొందుతున్నారని హోం శాఖ తెలిపింది.26,225 ఆహార శిబిరాల్లో కోటి మందికి పైగా భోజనం సరఫరా అవుతోందని ఆ శాఖ తెలిపింది.16.5 లక్షల మంది కార్మికుల కోసం ఆయా యాజమాన్యాలు క్యాంపులు నిర్వహించాయని పేర్కొంది.

 

896 new Corona cases Nationwide
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News