Saturday, May 11, 2024

స్పెల్లింగ్ బీ చాంపియన్ ఫైనల్‌కు 9మంది భారత-అమెరికన్ చిన్నారులు

- Advertisement -
- Advertisement -

9 Indo-American children for Spelling B Champion Finalists

 

వాషింగ్టన్: అమెరికా స్పెల్లింగ్ బీ 2021చాంపియన్‌షిప్ కోసం ఫైనల్ జాబితాకు ఎంపికైన 11మందిలో 9మంది భారత-అమెరికన్ చిన్నారులున్నారు. అమెరికాలోని 14 ఏళ్లలోపు చిన్నారులకు ఈ స్పెల్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. అమెరికాలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్న భారతఅమెరికన్ల పిల్లల్లోంచి కఠినమైన స్పెల్లింగ్ పరీక్షల్లో అధిక సంఖ్యలో ఫైనల్ జాబితాకు ఎంపిక కావడం గమనార్హం. ఫైనల్ జాబితాలో చోటు దక్కినవారికి జులై 8న మరిన్ని రౌండ్లలో స్పెల్లింగ్ పరీక్షలు నిర్వహిస్తామని బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా॥జె మైఖేల్ డర్నిల్ తెలిపారు. ఫైనల్ రౌండ్లను ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని ఇఎస్‌పిఎన్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. ఇఎస్‌పిఎన్ 2లో లైవ్ ప్రసారం చేస్తారు. కరోనా మహమ్మారి కారణంగా 2020 చాంపియన్‌షిప్ పోటీలను బీ రద్దు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News