Tuesday, April 30, 2024

ఎయిర్ ఏషియా సిఇఓకు ఇడి సమన్లు

- Advertisement -
- Advertisement -

AirAsia

న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్ సిఇఓ టోనీ ఫెర్నాండెజ్‌తోపాటు ఆ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారులను ప్రశ్నించే నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు జారీ చేసింది. 2018కు సంబంధించిన కేసులో వీరికి ఇడి సమన్లు జారీచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పిఎంఎల్‌ఎ) కింద వీరికి ఇడి సమన్లు జారీచేసింది. జనవరి 20న తమ ఎదుట హాజరుకావాలని ఫెర్నాండెజ్‌కు ఇడి సమన్లు జారీచేసింది. అదే విధంగా ఇతర అధికారులను కూడా వేర్వేరు రోజుల్లో హాజరు కావాలంటూ ఇడి ఆదేశించింది.

తమ సంస్థకు చెందిన ఎయిర్ ఏషియా ఇండియా లిమిటెడ్‌కు అంతర్జాతీయ లైసెన్సు పొందేందుకు అవినీతి మార్గాన్ని ఎయిర్ మలేషియా ఎంచుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఇడి దర్యాప్తు చేస్తోంది. 2018 మేలో ఎయిర్ ఏషియా అధికారులపై ఇడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎయిర్ ఏషియా ఇండియా డైరెక్టర్ రామచంద్రన్ వెంకటరామన్, డిటిఎ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు దీపక్ తల్వార్‌లపై కూడా అభియోగాలు నమోదు చేసింది. ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) కింద ఇడి ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

AirAsia CEO Tony Fernandes Summoned, ED summoned Senior executives of AirAsia for questioning in Money Laundering Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News